చంద్రబాబు భవిష్యత్తు తేల్చబోతున్న ఆ పత్రాలు ? ఎందుకంత కీలకమంటే !

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణలో పలు ట్విస్టులు చోటు చేసుకున్నాయి. స్కిల్ స్కాంలో తనను అరెస్టు చేసే విషయంలో సీఐడీ సెక్షన్ 17ఏ ప్రకారం నిబంధనలు పాటించలేదన్న సాంకేతిక కారణాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబుకు ప్రభుత్వం మరో అంశంలో ఝలక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో చోటు చేసుకున్న అక్రమాల విషయంలో అప్పట్లోనే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐడీ హైకోర్టులో చెప్పింది. దీని ఆధారంగానే హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. కానీ నిన్న జరిగిన సుప్రీంకోర్టు విచారణలో మాత్రం స్కిల్ కేసు దర్యాప్తు ప్రారంభమైంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2021లో అనే అంశాన్ని చంద్రబాబు లాయర్లు పదే పదే ప్రస్తావించారు.

how these documents crucial for supreme court to decide legality of chandrababu arrest ?

దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ప్రాధమికంగా తమ ముందు ఉన్న ఆధారాలను బట్టి రెండు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అందులో ఒకటి చంద్రబాబుపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ 2018లో పార్లమెంటు తెచ్చిన సెక్షన్ 17ఏ కంటే ముందా, తర్వాతా అన్నది ఒక అంశమైతే, సెక్షన్ 17ఏ కేవలం అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసులకే వర్తిస్తుందా లేక ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన సెక్షన్లకూ వర్తిస్తుందా అనేది రెండో అంశం.

ఇందులో స్కిల్ కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ 2018 జూలై 18న పార్లమెంటు సెక్షన్ 17ఏ తీసుకురావడాని కంటే ముందే నమోదు చేశారా లేక తర్వాత నమోదు చేశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి చంద్రబాబు ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావించని సీఐడీ న్యాయవాది స్కిల్ కేసు దర్యాప్తు మాత్రం చంద్రబాబు హయాంలోనే 2016లోనే ప్రారంభమైనట్లు చెప్పుకొచ్చారు. దీంతో ధర్మాసనం హైకోర్టుకు కూడా ఇవే ఆధారాలు ఇచ్చారా అని అడిగింది. దీనికి సమాధానంగా అవునని చెప్పడంతో ఆ పత్రాలు సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

మరోవైపు సెక్షన్ 17ఏ అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులకే వర్తిస్తుందా లేక ఐపీసీ సెక్షన్లకు కూడా వర్తిస్తుందా అన్న ప్రశ్న ధర్మాసనం ఎదురైంది. దీనికి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ అవినీతి నిరోధక చట్టం ప్రకారమే పెట్టారని, అందుకే ఏసీబీ కోర్డు రిమాండ్ విధించినట్లు ఆయన లాయర్లు తెలిపారు. అయినా ఐపీసీ సెక్షన్లకు కూడా సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబును అవినీతి నిరోధక చట్టం కిందే అరెస్టు చేసినందున ఇది చెల్లదని తీర్పు ఇవ్వాలని లాయర్లు కోరారు. దీనిపై తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+