కారులో రూ.18లక్షలు.. అన్ని కొత్త నోట్లే!.. పోలీసులు పట్టేసుకున్నారు
తాజాగా అనంతపురంలో రూ.18 లక్షల విలువైన కొత్త రూ.2వేల నోట్లు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం : ఓవైపు కొత్త నోట్లు దొరక్క సామాన్యులంతా అల్లాడుతుంటే.. మరోవైపు భారీ మొత్తంలో డబ్బు మూటలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతుండడం నివ్వెరపరుస్తోంది. బ్యాంకు సిబ్బంది అవకతకల వల్లనో.. లేక పలుకుబడినో ఉపయోగించుకుని కొంతమంది బడాబాబులు భారీ మొత్తంలో కొత్త రూ.2వేల నోట్లను దక్కించుకుంటున్నట్టుగా స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలోనే.. తాజాగా అనంతపురంలో రూ.18 లక్షల విలువైన కొత్త రూ.2వేల నోట్లు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో.. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగులో ఈ కొత్త నోట్లు పట్టుబడ్డాయి. నోట్లు తరలిస్తున్న వ్యక్తిని ధర్మవరానికి చెందిన బంగారం వ్యాపారి రవూఫ్‌గా గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని పట్టుబడ్డ డబ్బును ఐటీ శాఖ వారికి అప్పగించారు.













Click it and Unblock the Notifications