వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఇంటర్‌ చదువుల్లో భారీ మార్పులు- 30 శాతం సిలబస్‌ కోత - బ్రిడ్జి కోర్సులు, ఆన్‌లైన్‌...

|
Google Oneindia TeluguNews

కరోనా కారణంగా విద్యాసంవత్సరం నానాటికీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఇంటర్‌ కోర్సులను పలు మార్పులతో ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది ఈ మేరకు విద్యావిధానంతో పాటు సిలబస్‌, సెలవులు, ఇతర అంశాల్లో తాజా మార్పులతో విద్యాశాఖ ప్రణాళిక ప్రకటించింది. ఇందులో సీబీఎస్‌ఈ తరహాలోనే మొత్తం సిలబస్‌లో 30 శాతం కోత విధించనున్నారు. అలాగే విద్యా విధానంలోనూ పలు మార్పులు చేస్తున్నారు. వీటి ద్వారా ఈ విద్యాసంవత్సరం త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అధ్యాపకులకూ ఆదేశాలు అందాయి.

ఇంచర్‌లో సిలబస్‌ కోతలు...

ఇంచర్‌లో సిలబస్‌ కోతలు...

ఏపీలో ఇంటర్‌ విద్యావిధానంలో ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విద్యార్ధులపై ఒత్తిడిని నివారించేందుకు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. అత్యవసరమైన పాఠ్యాంశాలు మినహా మిగిలిన వాటిని సీబీఎస్‌ఈ తరహాలోనే సిలబస్‌ నుంచి తాత్కాలికంగా తొలగించనున్నారు. వీటిపై నిపుణులైన అధ్యాపకులతో ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేయిస్తోంది. కేంద్రం సీబీఎస్‌ఈ సిలబస్‌లో చేసిన కోతలపై విమర్శలు ఎదురైన నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలో మారిన పాఠ్యాంశాలపైనా సర్కారు ప్రకటన చేయనుంది.

సెలవుల్లోనూ కోతలు

సెలవుల్లోనూ కోతలు


ఏపీ ఇంటర్‌ విద్యలో సిలబస్‌ 30 శాతం మేర తగ్గించినా ఇప్పటికే మూడు నెలల సమయం కోల్పోవడం, సకాలంలో సిలబస్‌ పూర్తి కావడం, పరీక్షల నిర్వహణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పని దినాలు, సెలవుల్లోనూ పలు మార్పులు చేశారు. దీని ప్రకారం సెప్టెంబర్ 5 నుంచి కాలేజీలు ప్రారంభమై 175 పని దినాలు ఉండేలా మార్పు చేస్తున్నారు. దీంతో దసరా, సంక్రాంతితో పాటు ఇతర సెలవుల్లోనూ కోత విధించబోతున్నారు. కేవలం పండుగ రోజుల్లో మాత్రమే సెలవులు ఉండబోతున్నాయి. అదనపు సెలవులు రద్దవుతాయి.

ఆన్‌లైన్ పాఠాలు, బ్రిడ్జి కోర్సులు..

ఆన్‌లైన్ పాఠాలు, బ్రిడ్జి కోర్సులు..


ప్రస్తుతం కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పూర్తి చేసుకున్న లక్షల విద్యార్ధులు ఇంటర్‌లో చేరేందుకు ఎదురు చూస్తున్నారు. వీరికి ముందుగా బ్రిడ్జికోర్సులను బోధించేందుకు వీలుగా లెక్చరర్లను విద్యార్ధుల ఇంటికి పంపి మరీ ప్రభుత్వం ఒప్పించేలా చేస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగుపెట్టిన వారికి మాత్రం ఆన్‌లైన్ బోదన కొనసాగుతోంది. సెప్టెంబర్ 5 కల్లా బ్రిడ్జి కోర్సులను పూర్తి చేసి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు కూడా ఆన్‌లైన్ పాఠాలు బోధించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు విద్యార్ధుల తల్లితండ్రుల్లోనూ అవగాహన కల్పించేందుకు అధ్యాపకులు క్షేత్రస్ధాయిలో శ్రమిస్తున్నారు.

English summary
andhra pradesh government has announced huge changes in intermediate courses. as per the new directives 30 percent syllabus will be reduced and teaching continues in online mode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X