శివాలయాలు కిటకిట
చిత్తూరు: కార్తీకమాసం సోమవారం ప్రారంభం కావడంతో చిత్తూరు జిల్లాలో శివాలయాలు అన్ని భక్తజనం కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణ చేస్తూ భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరిస్తూ శివపార్వతుల్ని దర్శించుకున్నారు. తిరుపతి నగరంలో కపిలేశ్వరస్వామి సన్నిదిలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి.. స్వామి వారి సేవలో తరించారు. కార్తీక మాసం దీపావళి మరుసటి రోజే ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకుంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాలైన శ్రీకాళహాస్థి దేవాలయం, పుణ్యక్షేత్రమైన వేముల వాడ రాజన్న ఆలయం, వరంగల్లోని వేయి స్తంభాల గుడి, రాజమండ్రి ఆలయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications