Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్..సాయిరెడ్డికి భారీ రిలీఫ్ : బెయిల్ రద్దు పిటీషన్ కొట్టివేత-రఘురాంకు భారీ ఎదురు దెబ్బ..!!

సీఎం జగన్ కు భారీ రిలీఫ్ లభించింది. వైసీపీ రెబల్ ఎంపీ వేసిన బెయిల్ రద్దు పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టి వేసింది . సీఎంతో పాటుగా ఎంపీ విజయ సాయి రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు పిటీషన్లు దాఖలు చేసారు. వీటి మీద సీబీఐ కోర్టులో విచారణ సాగింది. ముఖ్యమంత్రి హోదా లో ఉన్న జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని...ఆయన ఏ1గా ఉంటూ ముఖ్యమంత్రి హోదాలో సాక్షులను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారంటూ రఘురామ రాజు కోర్టులో పీటీషన్ దాఖలు చేసారు.

తొలుత సీఎం పిటీషన్ దాఖలు చేసన రఘురామ రాజు తరువాతి కాలంలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి బెయిల్ పిటీషన్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసారు. ఈ రెండింటి పైన విచారించిన సీబీఐ కోర్టు ఇద్దరి బెయిల్ రద్దు చేయటానికి సహేతుక కారణాలు లేవంటూ రఘురామ రాజు పిటీషన్లను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

జగన్-సాయిరెడ్డిక గ్రేట్ రిలీఫ్..

జగన్-సాయిరెడ్డిక గ్రేట్ రిలీఫ్..

వైసీపీ అధినాయకత్వంతో విభేదించిన ఎంపీ రఘురామ రాజు..ఏకంగా ముఖ్యమంత్రి బెయిల్ పైన ఉండటానికి అనర్హులని పేర్కొంటూ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన జగన్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసారు. రఘురామ రాజు ప్రభుత్వానికి..పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆయన రాజకీయ కారణాలతోనే పిటీషన్ దాఖలు చేసారని జగన్ తరపు న్యాయవాది కోర్టు ముందు వాదించారు. దీనికి సమాధానంగా రఘురామ రాజు న్యాయవాది సీఎం స్థానంలో ఉంటూ అప్పట్లో కేసుల్లో నిందితులుగా ఉన్న అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని తమ వాదనలు వినిపించారు.

సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారు..

సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారు..

నిందితులను సీఎం స్థాయిలో ఉంటూ ప్రభావితం చేసే అవకాశం ఉందని రఘురామ రాజు తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. అదే విధంగా రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి బెయిల్ పైన ఉండటంతో ఆయన బెయిల్ సైతం రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసారు. ఈ రెండు కేసుల్లోనూ సీబీఐ తటస్థంగా వ్యవహరించింది. కోర్టు విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతూ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది. తొలుత ఈ కేసులో జగన్ పైన దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ ముగిసింది.

ఇద్దిరి పైన పిటీషన్లలో ఒకే రకంగా..

ఇద్దిరి పైన పిటీషన్లలో ఒకే రకంగా..

ఆ తరువాత ఎంపీ సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ లోనూ అవే అంశాలు ఉన్నాయనే అంశాన్ని కోర్టు ప్రస్తావించింది .ఇక, దీని పైన విచారణ ముగిసిన తరువాత సీబీఐ కోర్టు ఈ రోజున తీర్పకు రిజర్వ్ చేసింది.ఇదే సమయంలో ఒక్క రోజు సీబీఐ కోర్టు తీర్పుకు ముందు ఎంపీ రఘురామ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు పిటీషన్ల పైన విచారణ జరగుతున్న విషయాన్ని హైకోర్టుకు నివేదిస్తూ..తమకు ఆ విచారణ సమయంలో కొంత సందేహాలు ఉన్నాయని..ఈ కేసు మరో బెంచ్ కు బదిలీ చేయాలని కోరుతూ పిటీషన్ లో కోరారు.

బెంచ్ మార్చాలంటూ హైకోర్టులో పిటీషన్..కొట్టివేత

బెంచ్ మార్చాలంటూ హైకోర్టులో పిటీషన్..కొట్టివేత

దీని పైన హైకోర్టు న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేసారు. పలు ప్రశ్నలు సంధిస్తూ..కోర్టు పైన సందేహాలు వ్యక్తం చేయటం సరి కాదని కీలక వ్యాఖ్యలు చేసారు. దీని పైన విచారించిన హైకోర్టు ఈ రోజు రఘురామ రాజు దాఖలు చేసిన పిటీషన్ ను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో..సీబీఐ కోర్టు ముందుగా చెప్పిన విధంగానే బెయిల్ రద్దు పిటీషన్ల పైన తీర్పు వెల్లడించింది. రఘురామ రాజు దాఖలు చేసిన పిటీషన్ లో అంశాలతో విభేదిస్తూ..రఘురామ రాజు సీఎం జగన్..ఎంపీ విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లను డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది.

రఘురామ రాజు తరువాతి అడుగులు ఏంటి..

రఘురామ రాజు తరువాతి అడుగులు ఏంటి..

ఇక, దీంతో..ఈ వ్యవహారంలో సీఎం జగన్..విజయ సాయి రెడ్డికి భారీ రిలీఫ్ లభించగా..ఎంపీ రఘురామ రాజుకు ఎదురు దెబ్బ తగిలినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి . దీంతో ఈ తీర్పు పైన రఘురామ రాజు అప్పీల్ కు వెళ్తారా..లేక, ఈ విషయాన్ని ఇక వదిలేస్తారా అనేది ఆయన స్పష్టం చేయాల్సిన అంశం. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం..వైసీపీ ప్రభుత్వంలోని ముఖ్యులను టార్గెట్ చేస్తున్న రఘురామ రాజు ఈ కేసులో తదుపరి వేయబోయే అడుగులు కీలకం కానున్నాయి. తొలి నుంచి బెయిల్ రద్దు ఖాయమంటూ చెబుతూ వచ్చిన రఘురామ కు ఈ తీర్పు ఎదురు దెబ్బగా పరిగణించవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+