జగనన్నే మా భవిష్యత్ కు స్పందన అదుర్స్.. టాప్ 5లో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్నే మా భవిష్యత్తు అంటూ వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఈ కార్యక్రమం షెడ్యూల్ ను మరి కొద్ది రోజుల పాటు పొడిగిస్తూ ఈనెల 29వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, వాలంటీర్లు, మహిళలు, గృహ సారధులు ప్రతి ఒక్కరూ లక్షలాది కుటుంబాలను కలుసుకుంటూ ప్రజల నుంచి స్పందన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వ పాలనకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాలను వివరించే కరపత్రాలను పంచుతున్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకూ చేసిన వివిధ అభివృద్ధి పనులను, అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల స్పందన తెలుసుకుంటున్నారు. జగనన్నే మా భవిష్యత్తు నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనకు కొందరు ఎమ్మెల్యేలు విశేషంగా కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది .
ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా 75 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ రావడంతో వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మెగా పీపుల్ సర్వే కి ప్రజల నుంచి విశేషమైన స్పందన రావడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజలు వారి వారి అభిప్రాయాలను నమోదు చేస్తున్నారు. అలాగే తమ మద్దతు జగన్ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు.
అయితే ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు టాప్ ఫైవ్ లో నిలిచారు. మొదటి స్థానంలో చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఉండగా రెండో స్థానంలో అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి విశ్వరూప్ ఉన్నారు.
మూడవ స్థానంలో బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి ఉండగా నాలుగో స్థానంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు ఇక ఐదో స్థానంలో కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు ఉన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications