వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ పోలీసుల 'స్పందన'కు మంచి రెస్పాన్స్ ... 97% సమస్యలను పరిష్కరించామంటున్న డీజీపీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపీ పోలీసుల 'స్పందన'కు మంచి రెస్పాన్స్ || Huge Response To Spandana Programme Says Gowtham Sawang

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు విన్నవించుకుంటున్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఏపీ పోలీస్ శాఖ పని చేస్తున్న తీరుపై డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు అందుతున్న వినతులను సత్వరం పరిష్కారం చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

వైసీపీ సర్కార్ స్పందన కార్యక్రమంలో అధికారులు కూడా యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఇక పోలీస్ శాఖకు వచ్చిన ప్రతి వినతిని గరిష్టంగా 15 రోజుల్లో పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకొని, 97 శాతం వినతులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించామని పేర్కొన్నారు.

huge response to Spandana programme ..97% cases solved in police department

ముఖ్యంగా స్పందన కార్యక్రమంలో అందుతున్న వినతులలో గత నాలుగు వారాల్లో మొత్తం 10,079 వినతులు అందాయని అందులో 9791 వినతులను పరిష్కరించామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ముఖ్యంగా సివిల్ వివాదాలు, మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించామని పేర్కొన్న డీజీపీ ప్రస్తుతం 288 వినతులు మాత్రమే అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పారు.

నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు .. కొనసాగుతున్న చివరి అంకంనేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు .. కొనసాగుతున్న చివరి అంకం

ఇక అంతే కాకుండా సమస్య తీవ్రతను బట్టి 3082 వినతులపై కేసులు నమోదు చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు .కర్నూలు, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల పరిధిలో ఎక్కువ నిధులు వచ్చాయని తెలిపిన డిజిపి మాదక ద్రవ్యాల సరఫరా చేసే ముఠాల పని పడుతున్నామని చెప్తున్నారు .గంజాయి, గుట్కాల అక్రమ రవాణా, జూదం, బెట్టింగ్ ల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని ఆయన వెల్లడించారు. ఇక సోషల్ మీడియా వేదికగా వేధింపులు, అసభ్య కంటెంట్ పెరిగిపోతున్న నేపధ్యంలో సోషల్ మీడియా పై కూడా నిరంతర నిఘా ఉంటుందని ఏదైనా తేడా వస్తే నెటిజన్ల తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటికి పరిష్కారం పొందడానికి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది.

English summary
During the weekly Spandana programme launched by the government, 18.3% of the total complaints received by the police were crimes against women.Remaining grievances include: 19% civil disputes, 15% hurt cases, 11% property-related cases, 8% white collar offences, 4.7% family disputes and 15% others, Director General of Police (DGP) D. Gautam Sawang revealed during a press conference here on Monday.‘97% cases solved’ “Police had received as many as 10,000 complaints in the State in the last four Spandana programmes, of which 97% were resolved. Police registered 3,086 cases and Kurnool district topped in receiving and resolving the grievances, followed by East and West Godavari districts and Anantapur,” Mr. Sawang explained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X