కోటంరెడ్డి ఆలోచన మారిందా - టీడీపీకి జలక్ : భారీ ట్విస్టు..!?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆలోచన మారిందా. టీడీపీలో ఆయన చేరటం లేదా. ఏం చేయబోతున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రూటెటు. వైసీపీని వద్దన్నారు. టీడీపీలోకి ఎంట్రీ అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. కోటంరెడ్డి పరిణామాల పై టీడీపీ ముఖ్య నేతలు స్పందించటం లేదు. అదే సమయంలో టీడీపీలోకి ఆహ్వానించ లేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి మాత్రం టికెట్ల ఖరారు పై సొంత ప్రకటనలు సరి కాదని చెప్పుకొచ్చారు. టీడీపీ కాదంటే తనకు ఉన్న ప్రత్యామ్నాయాల పైన కోటంరెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కొత్త సమీకరణాలు తెర పైకి వచ్చాయి. వైసీపీ నుంచి దాదాపుగా బయటకు వచ్చిన ఆనం - కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లకుండా కొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.

కోటంరెడ్డి టీడీపీలో చేరటం లేదా..
వైసీపీ అధినాయకత్వాన్ని ధిక్కరించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కోటంరెడ్డి ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయ్యారని.. లోకేష్ తో టచ్ లో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబును కలిసారనే వాదనను కోటంరెడ్డి కూడా ఎక్కడా ఖండించటం లేదు. తాను వైసీపీ వద్దనుకున్నాక..ఎవరితో కలిసినా అనవసరమని పరోక్షంగా తాను చెప్పదలచుకున్నది స్పష్టం చేసారు. వచ్చే ఎన్నిలకలో టీడీపీ నుంచే కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ, కోటంరెడ్డి కారణంగా ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డ టీడీపీ శ్రేణులు వేచి చూసే ధోరణితో ఉన్నారు. కోటంరెడ్డి పార్టీలోకి వచ్చినా తాము సహకరించే పరిస్థితి ఉండదంటూ పార్టీ జిల్లా నేతలతో చెబుతున్నట్లు సమాచారం. దీంతో..సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని చెబుతూనే.. ఎవరికి వారే సీట్లు ఖరారు చేసుకోవటం సరి కాదని వ్యాఖ్యానించారు. దీంతో...కోటంరెడ్డి ముంద జాగ్రతలు తీసుకోవటం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇటు వైసీపీ ..అటు టీడీపీ మధ్యలో కోటంరెడ్డి
కోటంరెడ్డి తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీని వద్దని డిసైడ్ అయ్యారు. టీడీపీలోకి వెళ్లటం ఖాయమైనా..స్థానిక పరిస్థితులు ఎన్నికల సమయానికి ఎటు రూటు తీసుకుంటాయో అర్దం కాని పరిస్థితి. ఇప్పటి వరకు టీడీపీ నేతలత రాజకీయ యుద్దం చేసిన కోటంరెడ్డికి ఆ పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో సహకరించటం పైనా సందేహాలు ఉన్నాయి. అక్కడ గతంలో కోటంరెడ్డి పైన పోటీ చేసి ఓడిన నేతలు టీడీపీ నాయకత్వం నిర్ణయం కోసం వేచి చూస్తన్నారు. కోటంరెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉండటంతో..టీడీపీ నాయతక్వం కోటంరెడ్డి తో సంబంధాల పైన ఎక్కడా బయట పడటం లేదు. అటు ఆనం విషయం లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆనం - కోటంరెడ్డి ఇద్దరూ టీడీపీలోకి వెళ్లటం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు మాత్రం వారిద్దరి ఎంట్రీకి అంత సుముఖంగా లేరనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. దీంతో..టీడీపీలో పరిస్థితులు అనుకూలించకుంటే ప్లాన్ బీ సిద్దం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఆనం - కోటంరెడ్డికి కొత్త ఆఫర్లు
వైసీపీ లో ఎమ్మెల్యేలుగా ఉన్నా.. ఆనం - కోటంరెడ్డి ఆ పార్టీకి దూరమైనట్లే. ఇద్దరూ టీడీపీలో చేరుతారని ప్రచారం సాగుతున్నా.. జిల్లా రాజకీయాలు- టీడీపీ లో పరిణామాలు.. ప్రజల మూడ్ కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనే విధంగా ఇద్దరు నేతలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో తమ పార్టీ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ నెల్లూరు తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా.. కోటంరెడ్డికి బీఆర్ఎస్ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. ఇంకా ఎన్నికలకు 15 నెలల సమయం ఉండటంతో పాటుగా.. మరి కొంత కాలం రాజకీయంగా చోటు చేసుకొనే పరిణామాల ఆధారంగా కోటంరెడ్డి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ఆనంకు బీజేపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. దీంతో..ఈ ఇద్దరు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్న వేళ..చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలతో నెల్లూరు రాజకీయాలపై ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications