శృంగారంపై అనాసక్తి, భార్యను చంపి ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: తన బలహీనత ఎక్కడ బయటపడిపోతోందనే భయంతో పెళ్ళైన నాలుగు మాసాలకే భార్యను హత్య చేశాడు ఓ భర్త.. అంతేకాదు తన భార్య కన్పించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఎట్టకేలకు పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకొంది.

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం నూకనూటిపల్లి తండాకు చెందిన అంజలీబాయిని ఇద్దరు బంధువులతో కలిసి ఆమె భర్త హరినాయక్ హత్య చేశాడు. ఆమె మృతదేహన్ని శింగనమల వద్ద పూడ్చిపెట్టాడు..

 Husband kills his wife in Anantapur district

నూకనూటిపల్లి తండాకు చెందిన హరినాయక్ అదే తండాకు చెందిన అంజలీబాయిని ఈ ఏడాది మార్చి 15న, ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు. భార్యతో శృంగారం విషయంలో ఆయన అంతగా ఆసక్తి చూపేవాడు కాదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు సాగుతుండేవి.

అయితే ఈ విషయం ఎక్కడ బయటపడుతోందోమోననే కారణంతో భార్యను హత్య చేయాలని నిర్ణయించుకొన్నాడు హరినాయక్. తన అక్క కుమారుడైన గణేష్ నాయక్ వజ్రకరూరు మండలం నాగులగడ్డం తండాలో ఉంటున్నాడు. హరినాయక్ మిత్రుడు అనిల్‌నాయక్‌తో కలిసి భార్య హత్యకు ప్లాన్ చేశారు.

ఈ ఏడాది జూలై 11న, అంజలీబాయిని హరినాయక్ అక్క ఊరైన శింగనమల మండలం నాగులగుడ్డం తండాకు తీసుకొచ్చారు. పథకం ప్రకారం శింగనమల చెరువు సమీపంలో ముసలిమడుగు వద్దకు తీసుకెళ్ళారు. గణేష్, అనిల్‌తో కలిసి హరినాయక్ ..అంజలీబాయిని గొంతు నులిమి చంపేశాడు. పెట్రోల్ పోసి శవాన్ని దహనం చేశారు.

ఆనవాళ్ళు కన్పించకుండా ఉండేందుకుగాను గొయ్యి తీసి అక్కడే పాతిపెట్టారు. మరుసటి రోజే హరినాయక్ తన భార్య అంంజలీబాయి కన్పించడం లేదంటూ వజ్రకరూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

Husband Brutally Killed his Wife in Nellore District - Oneindia Telugu

అంతేకాదుయ ప్రతిరోజూ తన భార్య ఆచూకీ తెలిసిందా అంటూ నిందితుడు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగేవాడు. అయితే పోలీసులు హరినాయక్‌ను ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగుచూసింది.నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anantapuram police arrested Hari Naik for murdered his wife.Hari naik married anjali on March 2017. Hari naik murdered his wife on July 11, 2017 for some reasons.police arrested him on wednesday.
Please Wait while comments are loading...