ప్రమాదకరస్థాయికి హుస్సేన్‌సాగర్ నీటిమట్టం, అప్రమత్తం

సాగర్ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి) అధికారులు సాగర్ లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రమాదం లేకున్నప్పటికీ భారీగా నీరు చేరుతుండటంతో అప్రమత్తం చేస్తున్నారు.
వరదలో లారీ, బస్సు
రాష్ట్రవ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగాయి. పలుచోట్ల వాహనాలు నీటిలో చిక్కుకుంటున్నాయి. శుక్రవారం పలు జిల్లాల్లో వరదల ఉధృతితో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
మూసి నదికి వరద ఉధృతి పెరగడంతో ఐదు గేట్లు ఎత్తారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కుందు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా రాగల ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.