Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం త్వరలో చంద్రబాబు, రేవంత్ భేటీ, రూట్ మ్యాప్ అప్పుడే!

తెలుగు రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టిని సారించింది. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారులను విస్తరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. కేంద్రం రహదారుల విస్తరణను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుకు కసరత్తు
హైదరాబాద్ అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు కు సంబంధించి కసరత్తు కొనసాగుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ రోడ్డుని ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? ఎక్కడ అనుసంధానం చేయాలి? కీలకమైన ఎంట్రీ పాయింట్లు ఎక్కడ? అనేది ఇంకా ఖరారు కాలేదు. ఇక ఈ పాయింట్లు తేలితేనే దీనికి సమాంతరంగా నిర్మించాలి అనుకుంటున్న హైస్పీడ్ రైలు మార్గానికి కూడా గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది.

Hyderabad-Amaravati Greenfield Expressway Chandrababu Revanth to meet soon route map to be finalised soon

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సంబంధించి మొత్తం మార్గం పైన, ఇరు రాష్ట్రాలలో ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడ అనుసంధానం అవుతుంది? ఎంట్రీ పాయింట్ ఎక్కడ? ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ? అన్న అంశాల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రూట్ మ్యాప్ ఫైనల్ డెసిషన్ ముఖ్యమంత్రులదే
సీఎంలు స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన పూర్తి స్వరూపం,అలైన్మెంట్ ఖరారు అవుతుందని సమాచారం. రాష్ట్రంలోని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల మీదుగా మూడు రకాల ప్రాథమిక రూట్ మ్యాప్ లను సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రులు భేటీ అయిన తర్వాత, ఈ మ్యాపులను పరిశీలించి ఏదైనా ఒక రూట్ ను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదిస్తే, ఆ వివరాలను కేంద్రానికి సమర్పిస్తారు.

ఏపీ తెలంగాణ విభజన చట్టం ప్రకారం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే
ఆ తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం పనులు ప్రారంభిస్తారు. ఏపీ తెలంగాణ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ విజయవాడ మధ్య ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ను నిర్మిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించడానికి కేంద్రం ఓకే అంది.

హై స్పీడ్ కారిడార్ గా అభివృద్ధికి ప్లాన్
దీనిని హై స్పీడ్ కారిడార్ గా అభివృద్ధి చేయాలని, డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని, డ్రై కోర్టు నుండి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గాన్ని కూడా మంజూరు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ముందు ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు సంబంధించి రెండు రాష్ట్రాలు ఒక నిర్ణయానికి వస్తే ఆ తర్వాత పనులు వేగం పుంజుకోనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+