మారిషస్‌బ్యాంక్ ఎఫెక్ట్: సుజనాకు కోర్టులో షాక్, ఊరట

హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంకు లిమిటెడ్‌కు చెల్లించాల్సిన బకాయిల వ్యవహారంలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెండ్‌కు హైకోర్టులో మంగళవారం చుక్కెదురయింది. బకాయిలు చెల్లించని కారణంగా సుజన గ్రూప్ సంస్థ మూసివేతకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మారిషస్ బ్యాంక్ 'కంపెనీ పిటిషన్' దాఖలను హైకోర్టు స్వీకరించింది. అయితే, బకాయిల చెల్లింపుకు మరోసారి అవకాశం కల్పించింది.

కంపెనీ పిటిషన్ విచారణకు స్వీకరించిన వ్యవహారంపై ఇచ్చే ప్రకటనను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. హేస్టియా హోల్టింగ్ లిమిటెండ్ కంపెనీ తనకు రూ.106 కోట్లు బకాయి పడిందని, దీనికి సుజన గ్రూప్ సంస్థ హామీదారుగా ఉందని పేర్కొంటూ మలేషియా బ్యాంక్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ బకాయిలు చెల్లించాలని చెప్పిన హైకోర్టు, దానికి ఓ అవకాశం మాత్రం ఇచ్చింది.

Hyderabad High Court admits plea against Sujana firm

సుజనా యూనివర్సల్‌ ఇండస్ట్రీస్‌... కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజన చౌదరికి చెందినది. దీని పైనే మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ పిటిషన్ దాఖలు చేసింది. కంపెనీని మూసివేసి ఆస్తులు విక్రయించి తమ బకాయిలు జమచేయాలని కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. సుజనా కంపెనీకి వ్యతిరేకంగా మారిషస్‌ సంస్థ గతేడాది నవంబర్‌లోనే వైండప్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై ప్రాథమిక వాదనల తర్వాత 2014 డిసెంబర్‌ 8న పిటిషన్‌ను స్వీకరించాలా లేదా అన్న విషయంపై కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది. తాజాగా మంగళవారం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూనే, వైండింగ్‌ అప్‌ పిటిషన్‌ పబ్లికేషన్‌ను మాత్రం ఆరునెలలపాటు వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. బకాయిల చెల్లింపునకు సుజనాకు మరో అవకాశం ఇచ్చేందుకే కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+