ఆఫ్రికా స్త్రీ హత్య, ట్విస్ట్: మేమేంటో చూపిస్తామని పీఎస్‌లో బంధువుల హైడ్రామా

హైదరాబాద్: భార్య సింథియాను హత్య చేసిన రూపేష్‌ను ఉరితీయాలని మహిళ తరఫు బంధువులు బుధవారం నాడు డిమాండ్ చేశారు. సింథియా బంధువులు కాంగో నుంచి నిన్న బయలుదేరి, ఈ రోజు హైదరాబాద్ వచ్చారు.

వారు వచ్చీ రాగానే, శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వారు పోలీస్ స్టేషన్ రావడంతో కాసేపు అక్కడ హైడ్రామా కొనసాగింది. దాదాపు అరగంటకు పైగా వారు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సింథియా ఇక్కడ బాగా లేదని తమకు చెప్పిందని, తన భర్త ఆర్థిక పరిస్థితి బాగా లేదని పేర్కొందని, తాను కాంగో వస్తానని తమతో అన్నదని, కానీ అతను అంగీకరించలేదని మృతురాలి కుటుంబ సభ్యులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

Hyderabad man kills Congolese wife, burns body parts; all this while 5 year old daughter waited in car

సింథియాను హతమార్చిన రూపేష్‌ను ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు ముప్పై మంది కాంగో నుంచివచ్చారు. తమకు న్యాయం జరగకుంటే మేం ఏమిటో చూపిస్తామని వారు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ ఎదుట వారు నినాదాలు చేశారు. లోపలకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.

దాదాపు అరగంట పాటు వారు హైడ్రామా సృష్టించారు. వారిని ఇన్స్‌పెక్టర్లు, కానిస్టేబుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వెళ్లలేదు. అరగంట అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడి నుంచి సింథియా మృతదేహం ఉంచిన ఆసుపత్రికి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+