మెట్రో ప్రయాణీకులకు బంపరాఫర్ - ఇక నేరుగా..!!

హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. నగరంలో పెరుగుతున్న ఆక్యెపెన్సీకి తగినట్లుగా మరింతగా సౌకర్యాల కల్పన పైన ఫోకస్ చేస్తోంది. ప్రయాణీకుల సంఖ్యతో పాటుగా ఆదాయ వనరులను పెంచుకొనే మార్గాలను అన్వేషిస్తోంది. ఇందు కోసం బెంగళూరు మెట్రో అనుసరిస్తున్న విధానాలను అమలు చేయాలని భావిస్తోంది. త్వరలోనే ఈ మేరకు హైదరాబాద్ మెట్రో ప్రయాణీకుల కోసం కొత్త నిర్ణయాలను ప్రకటించనుంది.

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు సదుపాయాలు పెంచుతూనే ఆదాయం పెంపు కోసం కసరత్త చేస్తోంది. అందులో భాగంగా నగరంలోని ప్రధాన పాయింట్ల నుంచి నేరుగా మెట్రో స్టేషన్ల వద్దకే బస్సు సర్వీసు ను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తోంది. ఈ విధానం కారణంగా మెట్రో ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కలుగుతుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరులో మెట్రో ఫీడర్ బస్సు సర్వీసు పాయింట్లను కొనసాగిస్తున్నారు.

Hyderabad Metro planning for introduce bus service stations for passengers

మెట్రలో రోజు వారి ప్రయాణీకుల సంఖ్య...ప్రధానంగా ఏ కేటగిరీకి చెందిన వారు ప్రయాణం చేస్తున్నారనేది మెట్రో లెక్కలు సిద్దం చేసింది. వీరి కోసం బస్సు సర్వీసు పాయింట్లను పెంచటం ద్వారా మరింతగా ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది. బెంగళూరులో ఈ తరహాలో ఫీడర్ బస్సు సర్వీసు ప్రారంభానికి ముందు తరువాత వచ్చిన మార్పుల పైన హైదరాబాద్ మెట్రో అధ్యయనం చేసింది. దాదాపు 50 శాతం మేర ప్రయాణీకుల సంఖ్య పెరిగినట్లు గుర్తించింి. దీంతో మెట్రోకు ఆదాయం సైతం పెరిగింది. ఈ తరహా విధానమే హైదరాబాద్ లో అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+