హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్..!
హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అందింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులైన ఈ రెండు మహా నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సౌలభ్యంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మరో అడుగు పడింది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీన్ని అమలు చేయబోతోంది.
హైదరాబాద్-విజయవాడ మధ్య జాతీయ రహదారిని ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేగా విస్తరించేందుకు వీలుగా జాతీయ రహదారి ప్రాధికార సంస్ధ (NHAI) చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఈ పని కోసం టెండర్లు దక్కించుకున్న జీఎంఆర్ సంస్థ అర్ధాంతరంగా వైదొలగడంతో దాని స్ధానంలో మరో కాంట్రాక్టర్ ను ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రూ.700 కోట్ల బడ్జెట్ తో ఈ జాతీయ రహదారిని విస్తరించేందుకు టెండర్లు పిలవబోతున్నారు.

తెలంగాణ రాష్ట్రం పరిధిలో 181 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని గతంలో నాలుగు లైన్లుగా విస్తరించారు. కానీ ఆరు లైన్ల విస్తరణ సాధ్యం కాలేదు. కానీ అప్పటికే భూసేకరణ జరిగిపోవడంతో ఇప్పుడు కొత్తగా భూసేకరణ అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఈ రహదారి విస్తరణ పనులకు డీపీఆర్ తయారీకి ఓ ప్రైవేటు సంస్ధకు పనులు అప్పగించబోతున్నారు. అనంతరం రూ.700 కోట్ల పనులకు టెండర్లు పిలుస్తారు. వెంటనే పనులు కూడా ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనుల్ని వేగంగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇది పూర్తయితే హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ వేగం పెరగడంతో పాటు సమయం కూడా భారీగా ఆదా కానుంది.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications