గుంటూరు జిల్లాలో హైదరాబాదీ మృతి: నైజీరియన్ల అరెస్టు
గుంటూరు: బైక్‌పై వేగంగా వెళ్తుండడంతో అదుపు తప్పి కిందపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం గుంటూరు జిల్లా దుర్గి మండలం పొలెపల్లి అడ్డరోడ్డు మీద జరిగింది.
హైదరాబాదులోని వనస్థలిపురానికి చెందిన చెందిన విజయకృష్ణ రాజు (30) బైక్‌పై ఒంగోలులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో శుక్రవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా దుర్గి మండలం పొలెపల్లి అడ్డరోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి అతను కింద పడ్డాడు.
తీవ్రంగా గాయపడిన విజయకృష్ణ రాజును 108 వాహనంలో గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మరణించాడు.
గంజాయి అక్రమ రవాణా చేస్తూ దొరికినట్లే దొరికి పారిపోయిన ఇద్దరు నైజీరియన్లను చివరకు పోలీసులు పట్టుకోగలిగారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. టోరీ ముస్తబా, విక్టర్ డిజోబీ అనే ఇద్దరు నైజీరియన్లు తమిళనాడుకు చెందిన మురుగన్ అనే వ్యక్తితో కలిసి గంజాయిని చెన్నైకి తరలిస్తుండగా ఈ నెల 7వ తేదీన దొరవారిసత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే, నైజీరియన్లు పోలీసు స్టేషన్ నుంచి పరారయ్యారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన ప్రత్యేక బృందం తమిళనాడులోని ఈరోడ్డులో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి 60 కిలోల గంజాయిని, స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు నైజీరియన్ల వీసా గడువు 2012లోనే ముగిసిందని, అయినా అక్రమంగా దేశంలో ఉంటూ విశాఖ నుంచి చెన్నైకి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారని నెల్లూరు డిఎస్పీ శ్రీనివాసులు మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications