నేనెవరికీ భయపడను, మీ ఊరికి వస్తా!: కిరణ్(పిక్చర్స్)
హైదరాబాద్: తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామస్థులు పలువురు ముఖ్యమంత్రిని కలిశారు. తమ గ్రామానికి రావాల్సిందిగా వారు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. ఎవరో అడ్డుకుంటారని, మరెవరో బందుకు పిలుపు ఇచ్చారని తాను మెదక్ జిల్లాలో తన రచ్చబండ కార్యక్రమాన్న వాయిదా వేసుకోలేదని చెప్పారు. అదిలాబాద్ జిల్లాలో కృతజ్ఞత సభ ఉందని మంత్రులు చెప్పడం వల్లనే వాయిదా పడిందని వివరణ ఇచ్చారు.
తాను త్వరలోనే గ్రామానికి వస్తానని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడనని, వాటిని ఆపే ప్రసక్తి లేదన్నారు.
కాగా, కిరణ్ ఈరోజు మెదక్ జిల్లాలో సదాశివపేట మండలంలో జరగాల్సిన కిరణ్ రచ్చబండ వాయిదా పడిన విషయం తెలిసిందే. జిల్లా మంత్రులు గీతా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డిలు మంగళవారం కిరణ్‌ను కలిసి తమకు సభ ఉన్నందున రచ్చబండ కార్యక్రమానికి రాలేమని, వాయిదా వేసుకోవాలని కోరారు. దానికి కిరణ్ అంగీకరించారు.
మరోవైపు సిడబ్ల్యూసి నిర్ణయానికి వ్యతిరేకంగా సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్‌ను తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టనీయవద్దని పలువురు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెలంగాణ ఐకాస, ఇతర రాజకీయ నాయకులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కిరణ్ 3
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కరచాలనానికి పోటీ పడుతున్న సదాశివపేట మండలం వెల్టూరు గ్రామస్తులు.

కిరణ్
క్యాంప్ కార్యాలయంలో కలిసి కిరణ్ కుమార్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న మెదక్ జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామస్థులు.

కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు జెండాతో కూడిన నాగలిని బహూకరిస్తున్న మెదక్ జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామస్థులు. పక్కన ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి.

కిరణ్
కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలిసి రచ్చబండ కార్యక్రమం వాయిదాపై పడిన వార్తను చూపిస్తున్న వెల్టూరు గ్రామస్థులు.












Click it and Unblock the Notifications