వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 సంతకాలు: బాబు కంటే నేను యంగ్: జగన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందరి సమస్యలను తీరుస్తుందని ప్రజలకు జగన్ హామీ ఇచ్చారు.

జగన్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందని, ఇతర రాష్ట్రాలు గర్వపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు.

తాను ముఖ్యమంత్రిని అయ్యాక నాలుగు సంతకాలు పెడతానని, అవి చరిత్రను మార్చే సంతకాలని జగన్ అన్నారు. జనభేరీ సభా ప్రాంగణంలో దాదాపు ఇరవై అయిదు నిమిషాలు జగన్ ప్రసంగించారు. తాను చంద్రబాబు కంటే యువకుడినని, ఆయన కంటే తానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

విశ్వసనీయత లేని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనేక హామీలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

జనభేరీ

జనభేరీ

తమ పార్టీని గెలిపించుకుని రాష్ట్రాన్ని సింగపూరే కాదు షాంగై, దుబాయ్‌లను చేద్దామని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో వైయస్సార్ జనభేరి సభలో ఆయన మాట్లాడారు.

 పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోయారని ఆరోపించారు. ఇప్పుడు సింగపూర్ చేస్తామని తప్పుడు వాగ్ధానాలు చేస్తున్నారని విమర్శించారు.

బాబుపై జగన్ నిప్పులు

బాబుపై జగన్ నిప్పులు

విశ్వసనీయ లేని నాయకుడంటే చంద్రబాబేనని ఆరోపించారు. ఎన్నికల్లో వాగ్ధానాలు చేసి మర్చిపోవడం బాబుకు అలవాటేనని జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు అన్యాయంగా ఉందని చంద్రబాబు చెప్తే, ఆయన పార్టీ ఎంపీలు మాత్రం పార్లమెంటులో ఆ బిల్లుకే మద్దతు తెలుపుతారని ఆరోపించారు.

జగన్

జగన్

విభజన బిల్లును అడ్డుకోవడం తమకు సాధ్యం కాలేదని జగన్ తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు తోడు టిడిపి సహకరించడం వల్లే విభజన జరిగిందని ఆయన అన్నారు.

ఆశీర్వాదం

ఆశీర్వాదం

వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని జగన్ తెలిపారు. 30 ఎంపి స్థానాలను గెల్చుకుని, కేంద్రంలో తమకు అనుకూలమైన వ్యక్తిని ప్రధాని కూర్చిలో కూర్చోపెడతామని చెప్పారు.

సింగపూర్

సింగపూర్

రాష్ట్రాన్ని సింగపూర్ కంటే ఎక్కువ అభివృద్ది చేసుకుందామని చెప్పారు. బాబు పాతతరం మనిషని, తాము యువకులం కాబట్టి తమ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు సంతకాలు మొదట పెడతామని చెప్పారు.

సంతకాలు

సంతకాలు

అక్కా చెల్లెళ్ల కోసం వారి పిల్లలు చదువుకునేందుకు రూ. 500 నుంచి 1000 అందజేస్తామని చెప్పారు. అమ్మమ్మ, తాతయ్యల కోసం రెండో సంతకం, రైతుల పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మూడో సంతకం, నాల్గో సంతకంతో డ్వాక్రా మహిళా రుణాలను రద్దు చేస్తామని చెప్పారు. మన రాష్ట్రాన్ని చూసి దేశ గర్వపడేలా చేస్తామని అన్నారు.

అభివాదం

అభివాదం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందరి సమస్యలను తీరుస్తుందని ప్రజలకు జగన్ హామీ ఇచ్చారు.

English summary

 YSR Congress Party chief YS Jaganmohan Reddy on Monday promised to the people that he will make seemandhra as another Dubai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X