పట్టించుకోను.. ఫోటోలు దిగారుగా చాలంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..

సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో ఆయన ఈరోజు పర్యటించారు. ఈ క్రమంలోనే కొమరవోలు గ్రామస్తులు ఫోటోలు దిగుతుండగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఫుల్ గా ట్రెండింగ్ గా మారింది.

బాలకృష్ణ మాతృమూర్తి బసవతారకం స్వగ్రామం కొమరవోలు. ఆ గ్రామస్తులు బాలయ్యతో ఫోటోలు దిగుతుండగా.. తమ గ్రామాన్ని పట్టించుకోరా అని గ్రామస్తులు ప్రశ్నించారు. అందుకు బాలకృష్ణ పట్టించుకోను.. ఫోటోలు దిగారుగా.. ఇక వెళ్ళండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరవోలు గ్రామమా అదెక్కడ అని వ్యంగంగా మాట్లాడారు. కొమరవోలు గ్రామానికి ఈ జన్మలో రాను అని.. వాళ్లు లింగాయత్తులు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

I don t care Balakrishna s sensational comments on people while taking photos

దీంతో బాలకృష్ణపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తన అభిమానులను సైతం బాలయ్య కొట్టడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు గ్రామాన్ని పట్టించుకోమని కోరినందుకు ఆ రకంగా మాట్లాడడం.. సామాజిక వర్గాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

అంతకు ముందు నిమ్మకూరులో పర్యటించిన సందర్భంగా బాలకృష్ణ తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్రం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించిన తర్వాత బాలయ్య తొలిసారి నిమ్మకూరు రావడంతో గ్రామస్థులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. తన తండ్రి ఎన్టీఆర్‌కు త్వరలోనే 'భారత రత్న' వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+