తెలీదు.. గుర్తులేదు- సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలివే...!

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు సంబంధించి ఇవాళ మాజీ సీఎం చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు సాయంత్రానికి తాడేపల్లి సిట్ కార్యాలయానికి తెచ్చారు. అక్కడ కాసేపు విశ్రాంతి తర్వాత ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. స్కిల్ స్కాంకు సంబంధించి అధికారులు చంద్రబాబు పాత్రపై ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. దీనికి ఆయన దాదాపు ఒకే రకమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు సంబంధించి అప్పట్లో ఏం జరిగిందన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ సిట్ కార్యాలయంలో సీఐడీ అధికారులు 20 ప్రశ్నలు సంధించారు. అప్పట్లో అధికారులు రాసిన నోట్ ఫైల్స్ ను కూడా చంద్రబాబుకు సీఐడీ అధికారులు చూపించారు. దీనిపై ఆయన వివరణ ఏంటని అడిగారు. దీనికి చంద్రబాబు తెలీదు, నాకు గుర్తులేదు అనే సమాధానాలే ఇస్తున్నట్లు తెలుస్తోంది.

chandrababu

ముఖ్యంగా చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధుల మధ్య వాట్సాప్ చాట్ ను కూడా సీఐడీ అధికారులు ఆయనకు చూపించారు. చాటింగ్ గురించి ప్రశ్నించగా చంద్రబాబు తెలీదన్నారు. ఓ దశలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మధ్యమధ్యలో సీఐడీ అధికారులు అనుబంధ ప్రశ్నలు సంధించడంతో చంద్రబాబు కాస్త కూల్ అయ్యారని సమాచారం. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాలు, హవాలా లావాదేవీలపై అధికారులు వివరించిన సమయంలో ఆయన ముఖ కవళికలు మారిపోయినట్లు సీఐడీ వర్గాలు చెప్తున్నాయి.

మొత్తంగా చూస్తే చంద్రబాబు ఇవాళ సీఐడీ అధికారుల విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆయన సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పర్చాక సీఐడీ చంద్రబాబు రిమాండ్ తర్వాత కస్టడీ కూడా కోరవచ్చని తెలుస్తోంది. విచారణకు చంద్రబాబు సహకరించని అంశాన్ని కూడా కోర్టుకు వివరించే అవకాశం ఉన్నట్లు సీఐడీ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+