ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అసవరం లేదు - మోహన్ బాబు పిలిస్తేనే వెళ్లా - మంత్రి పేర్ని నాని..!!
తనను హీరో మోహన్ బాబు తన ఇంటికి రావాలని ఆహ్వానిస్తేనే వెళ్లానని మంత్రి పేర్ని నాని స్పష్టం చేసారు. మంత్రి తమ ఇంటికి రావటం పైన మంచు విష్ణు ట్వీట్ చేసారు. అది వైరల్ గా మారింది. దీంతో.. మంత్రి పేర్ని నాని స్పందిస్తూ మోహన్ బాబుతో తనకు చాలా కాలంగా పరిచయం ఉందన్నారు. వ్యక్తగత అంశాల చర్చల సమయంలో.. సినిమా అంశాలు చర్చించుకున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తరపున ఎవరికీ లేదా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
సినీ ఇండస్ట్రీలో సమస్యలు సృష్టించింది చంద్రబాబేనని.. ఇప్పుడు ఆ సమస్యలను సీఎం జగన్ పరిష్కరిస్తున్నారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైనా ఆయన స్పందించారు. సినిమా వాళ్లు పరిష్కారం లభించిందని ఆనందిస్తుంటే..చంద్రబాబు బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరెవరో ట్వీట్లు చేస్తే తనకేం సంబంధం అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు తాను 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెబుతారని..సినిమా పరిశ్రమ గురించి ఒక్కరోజైనా మంచి పని చేశారా అని ప్రశ్నించారు. తనకు నచ్చిన వాళ్లను ఒక రకంగా నచ్చని వాళ్లకు మరో రకంగా చూస్తారని ఆరోపించారు.

మోహన్ బాబు రానందుకు వివరణ ఇచ్చేందుకు వెళ్లాననే ప్రచారంలో నిజం లేదని చెప్పారు. 2002 నుంచి తనకు మోహన్ బాబుతో పరిచయం ఎందని చెప్పారు. ఈ రోజు అన్ని సరిదిద్దు సినిమా వాళ్లు కూడా కాలర్ ఎగిరేసుకొని వ్యాపారం చేసే పరిస్థితులు జగన్ మోహన్ రెడ్డి కల్పించారన్నారు. టాలీవుడ్ ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. బ్లాక్ టికెట్లతో దోచుకొనే సంప్రదాయానికి తెర తీసింది చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. అసలు సినీ ఇండస్ట్రీకి చంద్రబాబు ఏం చేశారని మంత్రి నాని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications