వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి అవుతాననుకోలేదు, సినిమాలకు బ్రేక్ పడింది, వేషాలతో నిరసన

By Narsimha
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: మొదటిసారి ఎమ్మెల్యేగా కాగానే మంత్రి పదవి కూడ దక్కిందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గుర్తు చేసుకొన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా శివప్రసాద్‌ను నియమిస్తున్నట్టు టీవీలో స్క్రోలింగ్‌ చూసే వరకు తనకు విషయమే తెలియదని ఆయన గుర్తు చేసుకొన్నారు. అయితే చంద్రబాబునాయుడకు ఫోన్ చేసి రూఢీ చేసుకొన్నానని ఆయన చెప్పారు.

ఆసక్తికరం: 'బాబు హీరోగా, నేను కమెడియన్‌గా నాటకం, టెన్త్‌ వరకు క్లాస్‌మేట్స్'ఆసక్తికరం: 'బాబు హీరోగా, నేను కమెడియన్‌గా నాటకం, టెన్త్‌ వరకు క్లాస్‌మేట్స్'

చిన్నతనం నుండి శివప్రసాద్‌కు నటన అంటే చాలా ఇష్టం. అయితే ఇప్పటికీ నటను వదిలపెట్టడు. అవకాశం దొరికితే సినిమాల్లో నటించడాన్ని వదులుకోడు. తాను హైస్కూల్‌లో చదువుకొనే సమయంలో తన స్నేహితుడు ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి శివప్రసాద్ నాటకం వేశారు.

ఆ నాటకంలో చంద్రబాబునాయుడు హీరో వేషం వేయగా, శివప్రసాద్ కామెడీ క్యారెక్టర్ వేశారు.అయితే రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇప్పటీకి కూడ శివప్రసాద్ సినిమాల్లో నటిస్తుంటారు. తాజాగా ఓ సినిమాలో ఆయన నటించారు. ఈ సినిమా కార్యక్రమాన్ని పురస్కరించుకొని తన ప్రస్తానాన్ని శివప్రసాద్ గుర్తు చేసుకొన్నారు

మంత్రి పదవి దక్కిందని టీవీలో చూశాకే తెలిసింది

మంత్రి పదవి దక్కిందని టీవీలో చూశాకే తెలిసింది

ప్రస్తుతం చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 6వ, తరగతి నుండి పదవతరగతి వరకు ఒకే స్కూల్. వీరిద్దరూ క్లాస్‌మేట్స్ కూడ. శివప్రసాద్‌కు నటన అంటే చాలా ఆసక్తి. అయితే సినిమాల్లో నటిస్తుండేవాడు.1998లో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శివప్రసాద్‌కు టిడిపి కల్చరల్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు..దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శివప్రసాద్ తిరిగారు.టిడిపి తరపున ప్రచారం కోసం వినూత్నంగా క్యాంపెయిన్ నిర్వహించినట్టు ఆయన గుర్తుచేసుకొన్నారు.1999లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాను. మంత్రివర్గంలో తనకు చోటు దక్కిందని టీవీలో స్క్రోలింగ్ చూశాకే తెలిసిందని శివప్రసాద్ చెప్పారు.

బాబుకు ఫోన్ చేసి రూఢీ చేసుకొన్నా

బాబుకు ఫోన్ చేసి రూఢీ చేసుకొన్నా


తొలిసారిగా ఎమ్మెల్యే పదవిని దక్కించుకొన్న తనను మంత్రివర్గంలోకి తీసుకొన్నారని టీవీలో స్క్రోలింగ్ చూసి తొలుత ఆశ్చర్యపోయాయని శివప్రసాద్ చెప్పారు.వెంటనే ఈ విషయమై చంద్రబాబుకు ఫోన్ చేస్తే వాస్తవమేనని చెప్పారు. వారం రోజుల తర్వాత అధికారిక ఉత్తర్వులు జారీ అయిన విషయాన్ని శివప్రసాద్ గుర్తు చేసుకొన్నారు.సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు.

సినిమా అవకాశాలు

సినిమా అవకాశాలు


1999లో మంత్రి కావడంతో సినిమాలకు బ్రేక్ పడిందని శివప్రసాద్ గుర్తు చేసుకొన్నారు. మంత్రిగా హైద్రాబాద్ జిల్లాకు ఇంఛార్జీగా ఉండడంతో పనులతో తీరిక లేకపోవడంతో సినిమాలకు టైమ్ కేటాయించలేదని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఈ కారణంగానే సినిమాలకు బ్రేక్ వేశానని ఆయన చెప్పారు.

పార్లమెంట్ వద్ద సమైక్యాంద్ర కోసం వేషాలు

పార్లమెంట్ వద్ద సమైక్యాంద్ర కోసం వేషాలు


పార్లమెంట్‌లో సమైఖ్యాంధ్ర కోసం రకరకాల వేషాలు వేస్తూ పోరాటం చేశానని శివప్రసాద్ గుర్తు చేసుకొన్నారు.. 2009 నుండి 2014లో ఎం.పీ అయ్యాను. మళ్ళీ సినిమాలు చేయడం కుదరలేదు. అప్పుడు నా మనవడు నైన్త్‌ క్లాస్‌ నుండి షార్ట్‌ ఫిలింస్‌ తీస్తున్నాడు. ఇప్పుడు బిటెక్‌ చదువుతున్నాడు. ఒకరోజు సప్తగిరిని తీసుకొని వచ్చాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమాలో ఫాదర్‌ క్యారెక్టర్‌ చేయాలి అని అడిగారు. నేను వున్న బిజీలో చేయలేను అని చెప్పాను. అయినా పట్టుబట్టి నాలో ఆ సినిమాలో మంచి వేషం చేయించారు. అది చాలా మంచి పేరు తీసుకొచ్చిందని శివప్రసాద్ గుర్తుచేసుకొన్నారు.

English summary
I was never expected to minister post said Chittoor MP Shiva prasad.he was worked information and cultural minister from 1999 to 2004..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X