బాబు వైఖరి మారకుంటే అంతే, పార్టీలోనే: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ పార్టీ వీడుతారని కొనసాగుతున్న ప్రచారానికి తెరపడింది. పార్టీని వీడతారన్న ప్రచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టిడిపి నాయకులు ఆయనతో బుజ్జగింపులు, చర్చలు జరిపారు. తెలంగాణలో టిడిపి బతకాలని కోరుకుంటున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. టిడిపి బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెలిపారు. తాను టిడిపిని కాపాడే ప్రయత్నమే చేస్తున్నానని చెప్పారు.
పార్టీని వీడితే తెలంగాణలో టిడిపికి గడ్డు కాలం ఎదురవుతుందని ఎర్రబెల్లికి రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఇతర జిల్లా నేతలు చెప్పినట్లు సమాచారం. అంతేగాక పలువురు జిల్లా నేతలు, కార్యకర్తల నుంచి కూడా ఎర్రబెల్లికి పార్టీ వీడొద్దని ద్వారా కోరినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరుమారకుంటే తెలంగాణలో టిడిపి బతకడం కష్టమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నట్లు సమాచారం.

తెలంగాణ టిడిపి ప్రత్యేక కమిటీని చంద్రబాబు నాయుడు వేస్తున్నారని, అందువల్ల పార్టీలో కొనసాగుతూనే పోరాటం సాగిద్దామని కార్యకర్తలకు ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించినట్లు తెలిసింది. తెలంగాణ టిడిపి కార్యకర్తలు టిఆర్ఎస్, ఇతర పార్టీలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
కాగా తెలంగాణ కమిటీ ఏర్పాటులో ఆలస్యం కారణంగానే ఎర్రబెల్లి పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారని, ప్రత్యేక కమిటీన చంద్రబాబు ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఆయన తిరిగి పార్టీలో కొనసాగేందుకు అంగీకరించారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. వారంలోగా ప్రత్యేక కమిటీని వేయనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications