టీవీ సీరియల్స్ పై సెన్సార్ కోసం...ప్రధానికి ఫిర్యాదు...కోర్టుకు కూడా: నన్నపనేని
గుంటూరు:టివి సీరియళ్లపై తన పోరాటం ఆపనని ఎపి మహిళా కమీషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు. హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉండే టీవీ సీరియల్స్ పై సెన్సార్ విధించాలంటూ కోర్టుకు వెళ్తానని నన్నపనేని చెప్పారు. ఆమె గుంటూరులో మీడియాతో మాట్లాడారు.

అంతేకాకుండా ఇదే విషయంపై ప్రధానికి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానన్నారు. సోషల్ మీడియాల్లో అశ్లీల దృశ్యాలను నిరోధించడానికి కృషిచేస్తామని నన్నపనేని హామీ ఇచ్చారు. మద్యపానం వల్లే మహిళలపై అకృత్యాలు పెరిగాయన్నారు. మద్యం అమ్మకాలను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా చట్టాలపై అవగాహన పెంచడానికి సదస్సులు నిర్వహిస్తామని నన్నపనేని రాజకుమారి ఈ సందర్భంగా చెప్పారు.












Click it and Unblock the Notifications