కాంగ్రెస్‌కు షాక్: టిఆర్ఎస్‌లోకి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు
నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమక్షంలో త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ అభ్యర్థన మేరకే నిజామాబాద్ మేయర్ ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చానని తెలిపారు.
నిజామాబాద్‌లో మేయర్ ఎన్నికకు రాజేశ్వరరావు అనుకూలంగా ఓటు వేశారు. కెసిఆర్ పకడ్బందీ ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారని రాజేశ్వరరావు అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందన్నారు. టిఆర్ఎస్‌లో చేరి బంగారు తెలంగాణకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారందరూ శాసనమండలిలో టిఆర్ఎస్ ఛైర్మన్ అభ్యర్థి స్వామిగౌడ్‌కు ఓటు వేసి ఆయన గెలుపులో భాగస్వాములయ్యారు. కాగా, తమ నేతలను కెసిఆర్ ప్రలోభ పెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావుకు ప్రభుత్వం అదనంగా గనులు, భూగర్భ వనరుల శాఖను కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.












Click it and Unblock the Notifications