లోకేష్: చంద్రబాబుతోనే పోటీ,ఎందుకంటే?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితోనే తాను పనిలో పోటీ పడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారాలోకేష్ చెప్పారు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితోనే తాను పనిలో పోటీ పడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారాలోకేష్ చెప్పారు.
గ్రామీణాభివృద్ది శాఖపై మంగళవారం నాడు మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశం తర్వాత లోకేష్ మీడియా ప్రతినిధులు చిట్ చాట్ చేశారు.

ప్రతి గ్రామానికి తాగునీటిని అందించడమే లక్ష్యంగా సాగనున్నట్టు చెప్పారు లోకేష్.రాత్రికి రాత్రికే తాగునీటి సమస్యను పరిష్కరించలేమన్నారు లోకేష్.
తనపై నమ్మకం ఉంచి కీలకమైన శాఖలు అప్పగించారని చెప్పారు.మంత్రి బాధ్యతలు చేపట్టకముందే
రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రయత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అయితే దానికి వైసీపి అడ్డుపడిందన్నారాయన.
తన ఛాంబర్ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదన్నారు.తాను పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే పోటీ పడతానని లోకేష్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications