స్పీడ్‌గా వస్తున్న ట్రక్ గుద్దుకొని ఐఏఎఫ్ టెక్కీ మృతి

తీవ్రమైన గాయాలు కావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె శ్రీనివాస్ రావు (42)కు ఈ ఏడాది మార్చిలో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జేఈగా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం షాపూర్ నగర్‌లోని సోదరుడి ఇంట్లో ఉంటున్నాడు. భార్యా పిల్లలు స్వగ్రామంలో ఉంటున్నారు.
సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బైక్‌పై డ్యూటీకి వెళ్తుండగా హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో శ్రీనివాస్ రావు అక్కడికక్కడే మృతిచెందాడు. అతని తలకున్న హెల్మెట్ ఎగిరి 50 మీటర్ల దూరంలో పడిపోయింది.
మృతదేహాన్ని రెండు మీటర్ల దూరం లారీ ఈడ్చుకెళ్లింది. ప్రమాదం గురించి తెసుకున్న దుండిగల్ ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్‌లో నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మూసీలో పడి యువకుడి మృతి
మూసీ నది వద్ద బహిర్భూమికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మృతి చెందాడు. కర్మన్‌ఘాట్‌లో నివాసముంటున్న యూనస్ (18) కొన్ని రోజులుగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు.
సోమవారం చాదర్‌ఘాట్ బ్రిడ్జి సమీపంలో మూసీలోకి బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో అతనికి ఫిట్స్ వచ్చాయి. దీంతో నీళ్లలో పడి చనిపోయాడు. సమాచారమందుకున్న కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని యూనస్ మృతదేహాన్ని తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications