గెలిచే సీనుంటే నాలుగు సర్వేలెందుకు బాబు .. విజయసాయి కౌంటర్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు నోరు మెదుపుతారా అని ఎటాక్ చెయ్యటానికి రెడీ గా ఉంటారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయి రెడ్డి తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ వేశారు.

నాలుగు సర్వేల్లో టీడీపీ విజయం ఖాయం అని తేలిందన్న చంద్రబాబు

నాలుగు సర్వేల్లో టీడీపీ విజయం ఖాయం అని తేలిందన్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో నంద్యాల, కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గాలపై చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సమీక్షలో ఆయన నాలుగు సర్వేలు నిర్వహించామని , ఈ నాలుగు సర్వేల్లో కూడ టీడీపీ విజయం ఖాయమని తేలిందని ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దని హితవు పలికారు. పార్టీ శాశ్వతం, ఎన్నికలు ప్రతి ఐదేళ్లకోసారి వస్తాయి. ప్రస్తుతం ఫలితాలు విడుదలైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయని ఆ ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు .

చంద్రబాబు వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్ .. ఆ సీనుంటే 4 సర్వేలెందుకు బాబు

చంద్రబాబు వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్ .. ఆ సీనుంటే 4 సర్వేలెందుకు బాబు

ఇక చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ గా విజయసాయి రెడ్డి మంగళవారం ట్విటర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. అసలు ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలిచే సీనుంటే బాబు నాలుగు రకాల సర్వేలెందుకు చేయించారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం ఏజెంట్లకైనా కాస్తా ధైర్యం నూరిపోయంటం మంచిదనివిజయసాయిరెడ్డి సూచించారు. ఎన్నికలు ఐదేళ్లకొకసారి మాత్రమే వస్తాయని, కానీ పార్టీలు శాశ్వతంగా ఉంటాయని అన్నారు.మేలో రావాల్సిన ఎన్నికలను ముందే జరిపి ఇబ్బంది పెట్టాలని చూశారు లాంటి శోకాలెందుకు? అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు.

బాబు ఏం మాట్లాడినా కౌంటర్ ఇవ్వటానికి విజయసాయి రెడీ

బాబు ఏం మాట్లాడినా కౌంటర్ ఇవ్వటానికి విజయసాయి రెడీ

తెలుగుదేశం పార్టీ నిజంగా గెలుస్తుందని చంద్రబాబునాయుడు భావిస్తే, నాలుగు రకాల సర్వేలను ఎందుకు చేయించాల్సి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కనీసం ఈ సర్వేల వివరాలను కూడా ఆయన బయటపెట్టలేదని ఎద్దేవా చేసిన విజయసాయి పార్టీ కార్యకర్తలకు ధైర్యం నూరిపోసే కార్యక్రమం చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. చంద్రబాబు ఏం మాట్లాడినా కౌంటర్ ఇవ్వటానికి మాత్రం విజయసాయిరెడ్డి ఎప్పుడూ రెడీగా ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+