మీ నిర్ణయం మంచిదా? అయితే ఏపీలో ఎందుకీ యుద్ధ వాతావరణం.. లోకేష్ సీరియస్

ఏపీ సీఎం మూడు రాజధానుల ప్రకటన నేపధ్యంలో ఏపీలో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ రాజధానిగా అమరావ్తినే కొనసాగాలని ఆందోళనలు చేస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌పై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు.

నేడు రాజధాని అంశంపై కీలక మంత్రివర్గ భేటీ జరుగుతున్న క్రమంలో టెన్షన్ నెలకొంది. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. రాజధాని ప్రాంతంలో అడుగుకో పోలీస్‌ని పెట్టారు. ప్రతి ఇంటి దగ్గరా 5గురు పోలీసులా? ముళ్ల కంచెలు, వాటర్‌ క్యాన్లు, టియర్‌ గ్యాస్‌, లాఠీలు, తుపాకులా? అని సీఎం జగన్‌ని ఆయన ప్రశ్నించారు. ఇక అంతే కాదు ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని నారా లోకేష్‌ జగన్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

 If your decision is good, tell me why the war atmosphere has come : Lokesh

వైసీపీ నేతలు జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని కితాబిస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్‌ తీసుకునే నిర్ణయం మంచిదైతే అమరావతిలో యుద్ధ వాతావరణం ఎందుకు వచ్చిందో చెప్పాలని వైఎస్‌ఆర్‌సిపి మేధావులు సమధానం చెప్పాలని నారా లోకేష్‌ ప్రశ్నించారు . ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతి ఉంటుంది, అద్భుతమైన నగరాన్ని కడతామని చెప్పిన జగన్‌గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లోకేష్ వ్యాఖ్యానించారు. శాంతియుతంగా రైతులు, రైతు కూలీలు, ప్రజలు ఆందోళన చేస్తున్నారని నారా లోకేష్‌ చెప్పారు. అయినప్పటికీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+