పవన్ కళ్యాణ్ కు అస్వస్థత: కొద్ది రోజులుగా క్వారంటైన్ లో జనసేనాని, తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు గా సమాచారం . పవన్ కళ్యాణ్ కు ఊపిరితిత్తులతో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఏర్పడినట్లు , దీంతో ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కరోనా సోకిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందా అన్న అనుమానం చాలామందికి వ్యక్తమవుతుంది. అయితే అది అధికారికంగా నిర్ధారించబడలేదు. తాజాగా ఆయన అనారోగ్య పరిస్థితి నేపథ్యంలో పవన్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

గత కొద్ది రోజులుగా హోం క్వారంటైన్ లో పవన్ కళ్యాణ్

గత కొద్ది రోజులుగా హోం క్వారంటైన్ లో పవన్ కళ్యాణ్

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇలా ఎవరు పడితే వారికి కరోనా సోకుతుంది. ఇదిలాఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త లో భాగంగా పవన్ కళ్యాణ్ సైతం హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. గత కొద్ది రోజులుగా ఆయన క్వారంటైన్ లోనే ఉంటున్నారు.

శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ , చికిత్స అందిస్తున్న వైద్యులు

శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ , చికిత్స అందిస్తున్న వైద్యులు

తాజాగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించినట్లుగా తెలుస్తుంది . శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కు వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తులలో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో వైద్యుల పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే పవన్ కు కరోనా పాజిటివ్ అని మాత్రం నిర్ధారించలేదు.

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ లో పాల్గొన్న బండ్ల గణేష్, దిల్ రాజుకు , పవన్ వ్యక్తికగత సెక్యూరిటీకి కరోనా

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ లో పాల్గొన్న బండ్ల గణేష్, దిల్ రాజుకు , పవన్ వ్యక్తికగత సెక్యూరిటీకి కరోనా

ఇదిలా ఉంటే ఇటీవల వకీల్ సాబ్ ఫ్రీ రిలీజ్ వేడుకలలో పాల్గొన్న బండ్ల గణేష్, దిల్ రాజు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధ పడుతున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఒకపక్క తిరుపతి ఉప ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో బిజెపి ,జనసేన పార్టీ నాయకులకు ఆవేదన కలిగిస్తోంది. పవన్ త్వరగా కోలుకోవాలని పవన్ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం సెన్సేషన్ సృష్టించడంతో సంతోషం లో ఉన్న ఫాన్స్, ప్రస్తుతం పవన్ ఆరోగ్యం పై ఆందోళనలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+