AP Weather ఏపీ వాసులకు అలర్ట్ - అప్రమత్తంగా ఉండాల్సిందే..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులు తోడవడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అగ్నిగుండంలా మారాయి. కోస్తాతోపాటు రాయలసీమలో ఎండ తీవ్రంగా ఉంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటుగా ఉధృతంగా వీస్తున్న వేడి గాలుల తో రాష్ట్రం అగ్నిగుండంగా మారుతోంది.

ఏపీలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయనగరంలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి, కాకినాడ, విజయనగరం జిల్లాల్లోని 13 మండలాలతో పాటు మరో 55 మండలాల్లో వడగాడ్పులు ఉధృతంగా వీచాయి.

Heat Wave Andhra Pradesh

కోస్తాతోపాటు రాయలసీమలో ఎండ తీవ్రంగా ఉంది. ఈ రోజు మన్యం జిల్లా సహా పలు జిల్లాల పరిధిలో 174 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ నెల 18 వరకు ఉత్తర కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయని పేర్కొంది. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. గత మూడు రోజులుగా పూర్తిగా వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. దీనికి వడగాలులు తోడయ్యాయి. అటు తెలంగాణలోనూ మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఏప్రిల్ 17వ తేదీ వరకు వర్షాలు పడుతాయని తెలిపింది. అయితే పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. గాలి వేగం గంటకు 30 -40 కి.మీ వీస్తాయని వెల్లడించింది. పలుచోట్ల వడగండ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+