వరుస అల్పపీడనాలు - ఈ జిల్లాలకు భారీ వర్షాల పై హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. మరో వేసవి కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. ఈ సమయంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో వరుసల అల్ప పీడనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కరుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ముందస్తు హెచ్చరిక చేసింది.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దక్షిణ బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న గంగానది పశ్చిమ బెంగాల్ మీదుగా కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం, ప్రభావంతో పాటుగా ఆగస్టు 29వ తేదీ 2026 అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.

మూడు రోజులు వర్షాలు పడే ఛాన్స్
దీంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది. దక్షిణ కోస్తాతో పాటుగా సీమ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది. అల్పపీడనం, ఉపరి తల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఈ జిల్లాలకు స్థానిక వాతావరణ శాఖ అప్రమత్తత జారీ చేసింది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో చినుకులు పడే అవకాశం ఉందని తెలిపింది.













Click it and Unblock the Notifications