అల్పపీడనం ఎఫెక్ట్: ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, తాజా హెచ్చరిక..!!

వర్షాల కోసం నిరీక్షిస్తున్న వేళ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు తాజా అలర్ట్స్ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది.

వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్ప పీడన కేంద్రం మీదుగా ప్రయాణించి, అక్కడినుండి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాంధ్రతో పాటుగా రాయల సీమ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, గంటకు 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదే విధంగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

 పవన్ కల్యాణ్ అనూహ్య నిర్ణయం, బీజేపీ వాట్ నెక్స్ట్..!!
పవన్ కల్యాణ్ అనూహ్య నిర్ణయం, బీజేపీ వాట్ నెక్స్ట్..!!
imd-latest-alerts-over-heavy-rains-in-many-of-telugu-states-in-next-two-days-as-low-pressure-in-bay

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ సహా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. కాగా, హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+