అల్ప పీడనం, పెరుగతున్న వరద- భారీ వర్షాలపై తాజా హెచ్చరికలు..!!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. కొంత తగ్గినట్లు కనిపించినా రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. నేటినుంచి మూడు, నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
నదులు ఉప్పొంగి:ఏపీ, తెలంగాణలో ఎడతెరపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం కరకట్ట వద్ద స్నాన ఘట్టాలు మునిగిపోయాయి.

ఏపీకీ భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనంతో రానున్న మూడ్రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడే చాన్స్ ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నాలుగు రోజులు భారీ వర్షాలు:ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. దాంతో.. నదీపరీవాహక ప్రాంతాల్ని ఖాళీ చేయించారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైనతేయ, వశిష్ట, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక.. ఇప్పటికే.. లంక గ్రామాలు మూడు, నాలుగు రోజులుగా వరద ముంపులో కొట్టుమిట్టాడుతున్నాయి.
అరటి, కూరగాయల పంట భూములన్నీ నీటమునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వచ్చే మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా.. రేపు, ఎల్లుండి మాత్రం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఎడతెరపిలేని వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

కోస్తాలో అప్రమత్తం:అల్పపీడనం ప్రభావంతో సోమ, మంగళ, బుధ వారాల్లో కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు, కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
మంగళ, బుధవారాల్లో కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అది భారీగా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తీరం వెంబటి గంటలకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని...మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చిరిక కేంద్రం పేర్కొంది. పోలవరంలోకి వస్తున్న వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రభావిత గ్రామాల అప్రజలు అప్రమత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications