రికార్డు ఉష్ణోగ్రతలు, 40 డిగ్రీలు దాటి- ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నంద్యాలలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీల కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు 39 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అలర్జ్ జారీ చేసారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
రికార్డు ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 39 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నంద్యాల జిల్లా ఆలమూరులో 40.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 39.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు (సోమవారం) అల్లూరి జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రా పురం మండలాల్లో వడగాలులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పార్వతీ పురం మన్యం జిల్లా బురుగుపల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మ వలస లోనూ ప్రభావం ఉండనుంది.

ఈ మండలాలకు అలర్ట్
అదే విధంగా పార్వతీ పురం, సీతం పేట, సీతానగరం, అల్లూరు జిల్లాలోని మారేడుమిల్లి, నెళ్లిపాక, వై రామవరం, ఏలూరు జిల్లాలోని కకునూరు, వేలేరు పాడు మండలాల్లోనూ వీటి ప్రభావం ఉంటుం దని వివరించారు. మంగళవారం 39 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఆదివారం నంద్యాల జిల్లాల ఆలమూరులో 40.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 39.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తీవ్ర వడగాల్పుల దృష్ట్యా ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లకు హెచ్చరికలు పంపించాలని అధికారులు నిర్ణయించారు.
వడగాలుల తీవ్రత
అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎండ తీవ్రత వల్ల ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. అయితే మండుతు న్న ఎండలకు తోడు రాష్ట్రంలో పలు చోట్ల విద్యుత్ అంతరాయం కలగటంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు. విద్యుత్ శాఖ ఇప్పటికే ఈ సమస్య పైన అధికారులను అప్రమత్తం చేసింది. ఇక, మరింత వేడి తీవ్రత పెరగనుండటంతో విద్యార్ధులకు ఒంటి పూట బడులు వెంటనే ప్రారంభించే అవకాశం పరిశీలన చేస్తున్నారు. ఎండ తీవ్రత వేళ ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకో వాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications