బలపడిన అల్పపీడనం - ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ లోటు వర్షపాతం నమోదు అవుతోంది. మరో వేసవి తరహాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు తప్పటం లేదు. ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో అల్ప పీడనం బలపడుతోంది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ అయింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలపడుతోంది. ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమబెంగాల్‌, ఒడిశా మీదుగా ఝార్ఖండ్‌ వైపు పయనించనుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత కొనసాగింది. తిరుపతి, కావలిల్లో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అల్పపీడనం తీరం దాటిన తర్వాత దక్షిణ దిశగా పయనిస్తే తప్ప ఉత్తర కోస్తా వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. తాజా అంచనా మేరకు అల్పపీడనంతో కోస్తాలో చెదురుమదురు వర్షాలు మాత్రమే కురుస్తాయని పేర్కొంది. రానున్న వారం రోజులు రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది. ఉత్తరాంధ్రలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున ఆదివారం మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

 శ్రీవారి సేవలో కొత్తగా వీరికీ TTD భాగస్వామ్యం - అర్హతలు, నమోదు ప్రక్రియ..!!
శ్రీవారి సేవలో కొత్తగా వీరికీ TTD భాగస్వామ్యం - అర్హతలు, నమోదు ప్రక్రియ..!!
imd-reports-fresh-low-pressure-area-heavy-rain-alert-for-ap-and-telangana-here-the-details

వాతావరణ శాఖ తాజా అలర్ట్స్

కాగా, ఈ నెలలో ఇప్పటివరకూ ఐదు అల్పపీడనాలు ఏర్పడగా.. ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. మరో వైపు మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ వ్యవస్థ ప్రభావం గణనీయంగా కనిపించనుంది. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పల్లపు ప్రాంతాల ప్రజలు, రైతాంగం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+