ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
గతేడాది ఒడిసాలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 300కు పైగా ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగా తూర్పు కోసా రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలోని పార్వతీపురం, గుమడ స్టేషన్ల మధ్య 3వ లైన్‌కు సంబంధించి నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని రైళ్లను అధికారులు రద్దుచేశారు. మరికొన్నింటిని దారిమళ్లించి నడుపుతున్నారు.
ఈ నెల 29 నుంచి మార్చి 5 వరకు
విశాఖపట్నం-భవానీపట్నం(08504),
విశాఖ-కొరాపుట్(08546),
విశాఖ-రాయపూర్-విశాఖ (08528-08527) రైళ్లను రద్దు చేశారు.

ఈనెల 29 నుంచి మార్చి 6 వరకు
కొరాపుట్-విశాఖ(08545)
మార్చి 1 నుంచి 6 వరకు
భవానీపట్నం-విశాఖపట్నం (08503) రైళ్లను రద్దు చేశారు.
మార్చి 1 నుంచి 4 వరకు
విశాఖ-కొరాపుట్(18512),
మార్చి 2 నుంచి 5 వరకు
కొరాపుట్-విశాఖపట్నం(18511) రైళ్లను రద్దు చేశారు.
ఈనెల 29, మార్చి 2, 3, 5 తేదీల్లో
విశాఖ-నిజాముద్దీన్(12807) రద్దయ్యింది.
ఈ నెల 29, మార్చి 1 2, 4 తేదీల్లో
నిజాముద్దీన్-విశాఖపట్నం (12808) రైళ్లు దువ్వాడ, విజయవాడ, బల్లార్షా మీదగా,
ఈనెల 29, మార్చి 3 తేదీల్లో
టాటా-ఎర్నాకుళం(18189),
ఈనెల 28, మార్చి 3 తేదీల్లో
ఎర్నాకుళం-టాటా(18190) రైళ్లను వయా టాటా-జరోలి-పలాస, విజయనగరం మీదుగా దారి మళ్లించారు.
ఈ నెల 29న
ఎర్నాకుళం-టాటా(08190) ప్రత్యేక రైలు 2 గంటలు,
మార్చి 1న
ఈరోడ్-సంబల్‌పూర్(08312) ప్రత్యేక రైలు 2 గంటలు,
మార్చి 3న
విశాఖ-లోకమాన్యతిలక్(22847) ఎక్స్‌ప్రెస్ 5 గంటలు,
మార్చి 4న
నాందేడ్-సంబల్‌పూర్(20810) ఎక్స్ ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా బయలు దేరుతాయి.
ఈ విషయాలన్నింటినీ గమనించి అందుకనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే రైల్వేకు సహకరించాలని కోరారు.












Click it and Unblock the Notifications