Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగాది వేళ కొత్త పంచాంగం ..! జగన్ పేరులో గన్..! చంద్రబాబు పేరులో దరిద్రం.. !

ఉగాది వేళ పంచాంగ శ్రవణం వింటారు . ఏ రాశివారికి ఎలా వుంది. ఏ పేరు కలిసొస్తుంది. పేరు బలం ఉందా లేదా? ఏ జన్మ నక్షత్రానికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఎవరికైనా ఆసక్తి కలిగిస్తుంది. కానీ ఉగాది వేళ పంచాంగ శ్రవణం మాట అటుంచి ఒకసారి ఏపీలో ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న పేర్ల రామాయణం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి.

ఉగాదివేళ జగన్ , చంద్రబాబు పేర్ల పంచాంగం .. కొత్త అర్ధాలు చెప్తున్న నేతలు

ఉగాదివేళ జగన్ , చంద్రబాబు పేర్ల పంచాంగం .. కొత్త అర్ధాలు చెప్తున్న నేతలు

ఉగాది పండుగ జరుపుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు జగన్, చంద్రబాబు పేర్లకు కొత్త అర్ధాలు చెప్తూ సాగుతున్న పంచాంగం విని విస్తు పోతున్నారు. ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతుంది . ఒకరిమీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో దాడి చెయ్యటమే కాదు పేర్లకు కూడా కొత్త అర్ధాలను, సరికొత్త భాష్యాలను చెప్తున్నారు. ఇక చంద్రబాబు ఎన్నికల ప్రచారం లో జగన్ పేరు మీద వ్యాఖ్యలు చేస్తే మొదటి నుంచి ట్విట్టర్ వేదికగా అధికార టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ సెటైర్ల సాయి రెడ్డి చంద్రబాబు పేరుకు కొత్త అర్ధం చెప్పారు. పేర్ల మీద కూడా ఇంతగా తిట్టుకోవచ్చా అని ఇది విన్న జనాలు విస్తుపోతున్నారు .

జగన్ పేరులో గన్ ఉంది.. అరాచకత్వం పెరుగుతుంది అన్న బాబు

జగన్ పేరులో గన్ ఉంది.. అరాచకత్వం పెరుగుతుంది అన్న బాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ అనే పేరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు . జగన్ అన్న పేరులోనే గన్ ఉందని , జగన్ ను గెలిపిస్తే అరాచకాలను గెలిపించినట్టేనని , రాష్ట్రం అంతటా అరాచకత్వం పెరిగిపోతుంది అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరుపై చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన సెటైర్ల సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోయారు .

చంద్రబాబు పేరులో ద్ర ఉంది .. ద్ర అంటే దరిద్రం అన్న విజయ సాయి రెడ్డి

చంద్రబాబు పేరులో ద్ర ఉంది .. ద్ర అంటే దరిద్రం అన్న విజయ సాయి రెడ్డి

జగన్ లోనే గన్ ఉందని అలాంటి వారు అధికారంలోకి వస్తే అరాచకాలు చెలరేగుతాయని బాబు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా చంద్రబాబు పేరులో ‘ద్ర' ఉందని ద్ర అంటే దరిద్రమని ప్రజలంతా చెప్పుకుంటున్నారని సెటైర్ వేశారు. జగన్ పేరులో గన్ ఉందన్న విషయాన్ని చంద్రబాబు భూగోళ, ఖగోళ శాస్త్రాలన్నింటిని శోధించి కనిపెట్టారని హేళన చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన వెంట తుఫాన్లు, కరవు కాటకాలు కాచుకుని ఉంటాయని ధ్వజమెత్తారు. జనాలు నవ్వుకుంటారన్న స్పృహ కూడా లేకుండా చంద్రబాబు వణుకుతూ ఏదో గొణుగుతున్నారని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక విజయసాయి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనాలు ఉగాది వేళ అధినేతల పేర్ల మీద జరుగుతున్న తిట్ల పంచాంగాన్ని విని నవ్వుకుంటున్నారు .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+