వాజపేయిలా ఊహిస్తే.., కిరణ్ మాట్లాడిందే భాష: కెటిఆర్

బాలరాజుపై సీమాంధ్రలో ఆగ్రహం
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా మాట్లాడిన మంత్రి బాలరాజుపై సమైక్వవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా గురువారం నిరసనలు కొనసాగాయి. నగరంలోని మంత్రి బాలరాజు ఇంటిని ముట్టడించేందుకు గురువారం విద్యార్థి జెఎసి ప్రయత్నించింది. అప్పటికే భారీగా పోలీసు బలగాలను మంత్రి ఇంటి వద్ద మోహరించారు.
విద్యార్థులు అక్కడికి చేరుకునేప్పటికి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇక ఆంధ్రా యూనివర్శిటీలో విద్యార్థులు మంత్రి బాలరాజు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పదవులు, ప్యాకేజీల కోసం బాలరాజు తెలంగాణకు మద్దతు పలకడం భావ్యం కాదని సమైక్యవాదులు అన్నారు.
24 గంటల్లో బాలరాజు తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సమైక్య రాష్ట్రానికి బాలరాజు మద్దతు తెలపకపోతే, ఆయనను సీమాంధ్రలో అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. బాలరాజు విశాఖ నగరంలో అడుగుపెట్టడానికి అనర్హుడన్నారు.












Click it and Unblock the Notifications