శ్రీలీల సాంగ్‌తో ఏపీ ప్రభుత్వానికి కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో కరెంట్ చార్జీలు పెరగవని హామీ ఇచ్చారు. కానీ ఏపీలో కరెంటు చార్జీలు పెరగబోతున్నాయి. డిసెంబర్ నెల నుంచి విద్యుత్ చార్జీల పెంపు ఉండనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత నెల రోజులుగా దీనిపై ఏపీ ప్రభుత్వం కసరత్తులో చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు కోసం ERC ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ERC అనుమతి మేరకు విద్యుత్ చార్జీలు పెంపుదల ఉండనుంది.2023-24 సంవత్సరానికి సంబంధించిన 9,412 కోట్ల ఇందన సార్‌తో పాటు చార్జీలను వసూలు చేయాలని ERC ఆదేశాలు ఇచ్చింది. దీంతో యూనిట్‌కు 92 పైసల చొప్పున డిసెంబర్ నుంచి 2026 నవంబర్ వరకు కరెంటు చార్జీలు వసూలు చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. 94 కోట్లలో వ్యవసాయ విద్యుత్ రాయితీ... రూ.1500 కోట్లను ప్రభుత్వం చెల్లించబోతున్నట్లు సమాచారం అందుతోంది. అంటే రూ.7,912 రూపాయల కోట్లు ఏపీ ప్రజలపై భారం పడబోతుందన్న మాట. అయితే దీనిపై వైసీపీ పార్టీ నిరసన తెలుపుతోంది.

తాజాగా పెంచిన విద్యుత్తు చార్జీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యంగ్యమైన పోస్టులతో వైసీపీ హల్ చల్ చేస్తోంది. దీని కోసం పోస్టుల్లో పుష్ప 2 సినిమాలోని అల్లు అర్జున్ ,శ్రీలీల నటించిన 'దెబ్బలు పడుతయిరో' స్పెషల్ సాంగ్‌ను యాడ్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. విద్యుత్తు చార్జీలు పెరిగాయని పోస్టులు పెడితే దెబ్బలు పడుతయిరో అన్నట్లుగా దీనికి లింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications