జెండా ఎగిరేసిన జగన్: అలరించిన ‘అల్లూరి’(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 68వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేద్కర్ లాంటి ఎంతో మంది దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అంకితం చేశారని తెలిపారు.
వారి స్ఫూర్తితో ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం కలిసి పనిచేసి దేశ సౌభాగ్యం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, యూసఫ్ అలీ, టిడి జనార్ధనరావు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో ఎంపి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే లక్ష్మణ్, సీనియర్ నేతలు విద్యాసాగర్ రావు, ఇతర నేతలు పాల్గొన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం(లోటస్ పాండ్)లో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ నేతల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వేడుకలు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వేడుకలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేద్కర్ లాంటి ఎంతో మంది దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అంకితం చేశారని తెలిపారు.

వేడుకలు
ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఓ చిన్నారి అల్లూరి సీతారామ రాజు వేషధారణలో ఆకట్టుకున్నాడు.

వేడుకలు
తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వేడుకలు
వేడుకల్లో ఎంపి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే లక్ష్మణ్, సీనియర్ నేతలు విద్యాసాగర్ రావు, ఇతర నేతలు పాల్గొన్నారు.

వేడుకలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ నేతలకు నివాళులర్పిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి.

వేడుకలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(లోటస్ పాండ్)లో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

వేడుకలు
ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications