ఇండియా టుడే ఆసక్తికర సర్వే... ఆ విషయంలో దేశంలో వైసీపీదే అగ్ర స్థానం
Recommended Video
దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 19 వ తేదీతో చివరి విడత ఎన్నికలు ముగుస్తాయి.మే 23 న ఫలితాలు వెల్లడి అవుతాయి. అయితే దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలపై ఇండియా టుడే ఒక ఆసక్తికరమైన సర్వే చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసిన లోక్ సభ అభ్యర్థుల క్వాలిఫికేషన్ పై చేసిన ఈ సర్వేలో ఏ పార్టీ నుండి ఎక్కువ మంది విద్యావంతులు ఎన్నికల బరిలో ఉన్నారు అన్న అంశంపై దృష్టి పెట్టింది.

విద్యావంతులను బరిలోకి దింపిన జాబితాలో దేశంలో తొలిస్థానం దక్కించుకున్న వైసీపీ
ఇక ఆ విషయం అటుంచితే ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థుల చదువు, అర్హతలను సర్వే చేసింది. ఇందుకోసం వారు సమర్పించిన అఫిడవిట్ పత్రాలను విశ్లేషించింది. ఇందులో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. విద్యావంతులు ఎక్కువగా ఉన్న జాబితాలో ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసీపీ మొదటి స్థానాన్ని సంపాదించుకుంది.ఇక బరిలో ఉన్న అభ్యర్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించిన లోక్ సభ నియోజకవర్గాల్లో శ్రీకాకుళం చోటు దక్కించుకుంది.

ఇండియా టుడే సర్వేలో లోక్ సభ బరిలో ఉన్న వివిధ పార్టీల విద్యావంతుల జాబితా
వైసీపీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 88 శాతం మంది డిగ్రీ, లేదా అంతకంటే ఎక్కువ పీజీలు చేసిన వారున్నారని ఇండియా టుడే సర్వేలో పేర్కొంది . ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన డీఎంకే 87.5 శాతం డిగ్రీ హోల్డర్లతో నిలవగా , అన్నాడీఎంకే 86.4 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది.

తెలంగాణా దేశంలో నాలుగో స్థానం ... 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో రాష్ట్రంలో తొలిస్థానం
ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో తొలిస్థానంలోనూ , దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. ఇక అలాగే ఈ జాబితాలో నామ్ తమిళర్ కట్చి 80 శాతం తో 5 వ స్థానం , సీపీఎం 78 శాతంతో 6వ స్థానం , కాంగ్రెస్ 76 శాతంతో 7వ స్థానం , తృణమూల్ కాంగ్రెస్ 75 శాతంతో 8వ స్థానం బీజేపీ 71 శాతంతో 9వ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఈసారి 139 మంది నిరక్షరాస్యులు బరిలో ఉన్నట్లు ఇండియాటుడే ఇంటెలిజెన్స్ యూనిట్ చెప్పింది. మొత్తానికి విద్యావంతులను బరిలోకి దింపిన వైసీపీ దేశంలో టాప్ 1 లో ఉంది .
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications