Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక వందేభారత్ - రూట్, టైమింగ్స్..!!

అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. కార్తీక మాసం ప్రారంభం కావటంతో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు ప్రయాణానికి సిద్దం అవుతున్నారు. సంక్రాంతి వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉంది. దీంతో, ఇప్పటికే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాజాగా వందేభారత్ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. దీనికి సంబంధించి రైళ్ల షెడ్యూల్ ను ప్రకటించింది. ఏపీలో ఏ స్టేషన్ల మీదుగా రైలు వెళ్లేదీ వెల్లడించింది.

ప్రత్యేక వందే భారత్‌:శబరిమల భక్తుల సౌకర్యార్థం చెన్నై - తిరునల్వేలి మధ్య ప్రత్యేక వందే భారత్‌ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నెం.06067 చెన్నై ఎగ్మూర్‌ - తిరునల్వేలి ప్రత్యేక వందే భారత్‌ రైలు ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 6 గంటలకు ఎగ్మూర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 2.15 గంటలకు తిరునల్వేలి చేరుకుంటుంది. అలాగే, నెం.06068 తిరునల్వేలి - చెన్నై ఎగ్మూర్‌ ప్రత్యేక వందే భారత్‌ రైలు ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు తిరునల్వేలిలో బయల్దేరి రాత్రి 11.15 గంటలకు ఎగ్మూర్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు తాంబరం, విల్లుపురం, తిరుచ్చి, దిండుగల్‌, మదురై, విరుదునగర్‌ స్టేషన్లలో ఆగుతాయి.

Indian Railways Announces Special Trains for Sabarimala, releases schedule

ఏపీ స్టేషన్ల మీదుగా:శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ట్రైన్ నెంబర్ 06079 తాంబరం-సంత్రాగచ్చి ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 15, 22 తేదీల్లో మధ్యాహ్నం 1 గంటకు తాంబరంలో బయల్దేరి మరుసటిరోజు రాత్రి 8.45 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. అలాగే, నెం.06080 సంత్రాగచ్చి - తాంబరంప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 16, 23 తేదీల్లో రాత్రి 11.40 గంటలకు సంత్రాగచ్చిలో బయల్దేరి మూడవరోజు ఉదయం 9.35 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ఈ రైళ్లు చెన్నై ఎగ్మూర్‌, గూడురు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్‌, విజయనగరం, పలాస, కుర్దా రోడ్డు, భువనేశ్వర్‌, కటక్‌, భద్రక్‌, బాలాసోర్‌, ఖరగ్‌పూర్‌ స్టేషన్లలో ఆగుతాయి.

అదనపు రైళ్లు:ట్రైన్ నెం 06081 తాంబరం - భువనశ్వేర్‌ ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ రైలు ఈ నెల 21న మధ్యాహ్నం 1 గంటకు తాంబరంలో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.55 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. అలాగే, నెం.06082 భువనేశ్వర్‌ - తాంబరం ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ రైలు ఈ నెల 22వ తేది మధ్యాహ్నం 12.50 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12 గంటలకు తాంబరం చేరుకుంటుంది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లలో వెయింటింగ్ లిస్టు భారీగా ఉండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+