రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక... టికెట్ల బుకింగ్ లో మారిన నిబంధనలు?
ప్రతిరోజు లక్షలాది ప్రయాణికులను రైళ్ళు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. భారతీయులకు, రైల్వేకు విడదీయరాని బంధం ఉంటుంది. నిత్యం రైలుబండిలో రాకపోకలు సాగించేవారే లక్షల్లో ఉంటారు. ప్రయాణం చేయడానికి ముందుగా రిజర్వేషన్ చేయించుకోవడం కామన్ అన్న సంగతి తెలిసిందే. టికెట్ బుకింగ్ కు సంబంధించి రైల్వే కొత్త నిబంధనలను విడుదల చేసింది.
మారిన నిబంధనలు ప్రయాణికులకు ప్రయోజనాన్ని చేకూర్చనున్నాయి. కొన్ని సమయాల్లో అనుకున్న సమయానికి ప్రయాణం చేయలేని పరిస్థితులు తలెత్తుతాయి. అటువంటి సందర్భంలో మన కుటుంబ సభ్యులపేరుమీదకు టికెట్ ను బదిలీ చేయవచ్చు. రైలు టికెట్ ను ఎవరి పేరుమీద తీసుకున్నప్పటికీ ఆ టికెట్ ను తల్లి, తండ్రి, సోదరుడు, భార్య, కుమార్తె, భార్య, భర్తకు ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. స్నేహితులకు బదిలీ చేయడానికి వీల్లేదు.

తీసుకున్న టికెట్ ను ప్రింట్ తీసుకొని సమీప రైల్వేస్టేషన్ లోని రిజర్వేషన్ కార్యాలయ చీఫ్ మేనేజర్ ను కలవాలి. ఎవరిపేరు మీద టికెట్ బదిలీ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డు లాంటి ఐడీలను రుజువుగా చూపించాలి. వీటితోపాటు దరఖాస్తును సమర్పించాలి. బదిలీ కూడా 24 గంటల ముందుగానే జరగాలి. రైల్వే నిబంధనల ప్రకారం వేరొకరి పేరుమీదకు టికెట్ బదిలీ చేయడానికి 24 గంటల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పిస్తారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే తన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఉన్న దూరాన్ని సాధ్యమైనంత తక్కువ సమయంలో చేరుకునేలా వందే భారత్ పేరుతో సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు సర్వీసులు నడుస్తున్నాయి. మరో సర్వీసు రేపు అందుబాటులోకి రానుంది. ప్రయాణికుల నుంచి వందే భారత్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. దీంతో త్వరలోనే ఎక్కువ దూర ప్రయాణాలకు వందే భారత్ రైళ్లకు స్లీపర్ బోగీలు అమర్చి అందుబాటులోకి తీసుకురానున్నారు.












Click it and Unblock the Notifications