ప్రభాస్ Vs మహేష్ బాబు... ఇండియాస్ బిగ్గెస్ట్ ఫైట్!
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఎప్పుడైతే రూపుదిద్దుకున్నాయో అప్పటి నుంచే తెలుగు చలనచిత్రాల బడ్జెట్ మారిపోతూ వస్తోంది. ఎంత ఖర్చుపెట్టామన్నది కాదు.. ఎంత వసూలు చేశామన్నదే ఇప్పుడు ప్రధాన పాయింట్ గా మారింది. కథ డిమాండ్ ను బట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టడానికి, అత్యధిక వ్యయంతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు వెనుకాడటంలేదు. ఒకప్పుడు సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ అయిందంటే అమ్మో అనేవారు. అలాంటిది ఈరోజు బడ్జెట్ వందల కోట్లరూపాయలుగా మారింది.
ఆదిపురుష్ సినిమాకు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లు, ఆర్ఆర్ఆర్ సినిమా రూ.400 కోట్ల బడ్జెట్ తో చిత్రీకరించుకున్నాయి. భారతదేశంలోనే అత్యధిక వ్యయంతో ఈ సినిమాలు రూపుదిద్దుకున్నాయి. తాజాగా మరో రెండు సినిమాలు అత్యధిక వ్యయంతో రూపుదిద్దుకోబోతున్నాయి. ఆ రెండు సినిమాల్లో హీరోలు కూడా తెలుగువారే కావడం తెలుగు సినీ పరిశ్రమకు, తెలుగు సినీ ప్రేక్షకులకు గర్వకారణం. ఒకరు ప్రభాస్ కాగా, మరొకరు మహేష్ బాబు.

ప్రాజెక్ట్ కే కోసం వైజయంతి మూవీస్ రూ.700 నుంచి రూ.800 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, అమితాబ్‌బచ్చన్, కమల్ హాసన్ లాంటి ఉద్దండులు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకోలేదు. వరల్డ్ వైడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నారు. అలాగే మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతున్న సినిమా ప్రాజెక్ట్ కేని తలదన్నేలా నిలవబోతోంది. ఈ చిత్రానికి ఏకంగా రూ.1500 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఇంగ్లిష్ వెర్షన్ కూడా రెడీ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు అంచనాలను ఏవిధంగా అందుకున్నాయనేది అవి విడుదలైన తర్వాతే తేలుతుంది.












Click it and Unblock the Notifications