వాతావరణం సరిగాలేక విమానం ఆలస్యం, తండ్రి అంత్యక్రియలకు వెళ్ళేందుకిలా..

విశాఖ నుండి బెంగుళూరుకు ఉదయం వెళ్ళాల్సిన విమానం మధ్యాహ్నమైనా విమానాశ్రయంలోనే ఉంది. ప్రతికూల వాతావరణం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు.

విశాఖపట్టణం:విశాఖ పట్టణం ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరాల్సిన విమానం మధ్యాహ్నమైనా వెళ్ళలేదు.దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణం సరిగా లేదని అధికారులు చెబుతున్నారు.

విశాఖ పట్టణం ఎయిర్ పోర్ట్ నుండి మంగళవారం నాడు ఉదయం బయలుదేరాల్సిన ఇండిగో విమానం మధ్యాహ్నమైనా బయలురేరలేదు. విమానం ఎందుకు ఆలస్యమౌతోందని అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ పట్టణం నుండి బెంగుళూరుకు ఉదయం వెళ్ళాల్సిన విమానం మధ్యాహ్నమైనా వెళ్ళలేదు.ఉదయం 7.55 నిమిషాలకు వెళ్ళాల్సని విమానం మధ్యాహ్నమైనా ఎయిర్ పోర్ట్ నుండి కదల్లేదు.

indigo flight delay in vizag airport

ప్రయాణీకుల్లో ఒకరు తన తండ్రి అంత్యక్రియలకు వెళ్ళాల్సి ఉంది.త్వరగా వెళ్ళేందుకు విమానాన్ని ఆశ్రయిస్తే ఎయిర్ పోర్ట్ లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన చెందారు.

విమానం ఎందుకు ఆలస్యమైందనే విషయమై ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారు.అయితే ప్రతికూల వాతావరణం కారణంగానే విమానం ఆలస్యమైందని అధికారులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+