హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వచ్ఛ సర్వేక్షన్: ఇండోర్ టాప్, 10లో విశాఖ, తిరుపతి, మెట్రోల్లో హైదరాబాద్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లి: స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2017 ర్యాంకులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మన శరీరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో.. అలాగే మన పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

స్వచ్ఛభారత్‌ అన్నది ఒకరోజు కార్యక్రమం కాదని.. నిరంతర ప్రక్రియని అన్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛత పాటించిన 434 పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులు ఇచ్చినట్లు చెప్పారు. ర్యాంకులు పొందిన పట్టణాలకు అభినందనలు తెలిపారు. 2019 నాటికి స్వచ్ఛభారత్‌ లక్ష్యం నెరవేరాలని ప్రధాని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెంకయ్య వివరించారు.

స్వచ్ఛ సర్వేక్షన్ జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం తొలి ర్యాంక్‌ సాధించింది. గత రెండు సర్వేల్లో తొలి ర్యాంక్‌ సాధించిన మైసూర్‌ ఈసారి ఐదో ర్యాంక్‌కు పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, తిరుపతి టాప్‌టెన్‌లో స్థానం సాధించాయి. మొత్తం 434 పట్టణాలకు ర్యాంకులు విడుదల చేశారు.

Indore ranked cleanest city in India, Gonda in UP the dirtiest: Govt survey

తొలి పది ర్యాంకులు

1. ఇండోర్‌
2. భోపాల్‌
3. విశాఖపట్నం
4. సూరత్‌
5. మైసూర్‌
6. తిరుచురాపల్లి
7. న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌
8. నవీ ముంబయి
9. తిరుపతి
10.వడోదర

ఇక టాప్‌-50లో గుజరాత్‌ నుంచి 12, మధ్యప్రదేశ్‌ నుంచి 11, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 8 పట్టణాలు స్థానం సాధించాయి. ఈ మూడు రాష్ట్రాలు స్వచ్ఛభారత్‌లో గణనీయమైన ప్రగతి సాధించాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2017 జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పట్టణాలు టాప్‌-50లో చోటు దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖపట్నం, తిరుపతి తొలి పదిస్థానాల్లో ఉండగా.. మరో ఆరు పట్టణాలు టాప్‌ 50లో ర్యాంకు సాధించాయి. తెలంగాణ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ 22వ స్థానంలో నిలవగా, మరో మూడు పట్టణాలు టాప్‌- 50 జాబితాలో స్థానం సంపాదించాయి.

తెలంగాణ నుంచి టాప్ 50లో ఉన్న నగరాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌(22)
వరంగల్‌ (28)
సూర్యాపేట్‌ (30)
సిద్దిపేట్‌(45)

ఆంధ్రప్రదేశ్‌ నుంచి..

విశాఖపట్నం(3)
తిరుపతి(9)
విజయవాడ (19)
తాడిపత్రి (31)
నర్సరావుపేట(40)
కాకినాడ (43)
తెనాలి (44)
రాజమండ్రి(46)

కాగా, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాబితాలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఒక్క ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసి మినహా మిగతా పట్టణాలన్నీ చివరి ర్యాంకుల్లోనే ఉన్నాయి. మొత్తం 434 పట్ణణాలున్న ఈ జాబితాలో వారణాశి 32వ ర్యాంకు దక్కించుకుంది. యూపీలోని గోండా పట్టణం 434వ ర్యాంకుతో అట్టడుగు స్థానంలో నిలిచింది.

మెట్రో నగరాల్లో హైదరాబాద్ టాప్

మెట్రో నగరాలలో జీహెచ్ఎంసీ మొదటి స్థానంలో ఉంది. గత సంవత్సరం 73 పట్టణాలలో జీహెచ్ఎంసీకి 19వ స్థానం దక్కిన విషయం తెలిసిందే. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను కేంద్రం ఏర్పాటు చేసింది.

English summary
Indore has been ranked as the cleanest city in India+ while Gonda in Uttar Pradesh has been ranked the dirtiest among 434 cities, a government survey has found. Bhopal, another city from MP has been ranked second while Visakhapatnam in Andhra Pradesh and Surat in Gujarat have emerged as the third and fourth cleanest cities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X