సర్వే విరుద్ధం: ఇంద్రసేన్, ఇంటికో ఈక: మోత్కుపల్లి
హైదరాబాద్ : ఈ నెల 19 తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర సర్వే రాజ్యాంగ విరుద్ధమని బిజెపి సీనియర్ నేత ఎన్. ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సమగ్ర సర్వేపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఆయన బుధవారం మీడియా వద్ద స్పందించారు.
వ్యక్తుల మతం, కులం, పాన్‌కార్డు నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పాలని అడిగే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. ఈ వివరాలు దుర్వినియోగమైతే పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కేంద్రం సేకరించే జనాభా లెక్కల్లో కూడా కులం, మతం ప్రస్తావన ఉండదని ఆయన గుర్తు చేశారు.

దళితులకు భూపంపిణి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం దళితులందరికీ విధిగా మూడెకరాల భూమి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పరిపాలనపై తనదైన శైలిలో మోత్కుపల్లి విమర్శలు గుప్పించారు. కెసిఆర్ పరిస్థితి ఊరికొక కోడి... ఇంటికొక ఈక అన్న చందంగా ఉందని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. దళితులందరికీ మూడెకరాలు భూమి ఇస్తానని హామీ ఇచ్చారు కాబట్టి ఇచ్చి తీరాల్సిందేనని ఆయన ఆయన అన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications