ఆటో దిగి అందరూ చూస్తుండగా నదిలోకి దూకేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్‌ పంచాయతీ హరిజన వీధికి చెందిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కనుపూరు పవన్‌కుమార్‌ (17) శుక్రవారం సీది బ్రిడ్జిపై నుంచి మహేంద్ర తనయా నదిలోకి దూకి గల్లంతయ్యాడు.

అందరూ చూస్తుండగానే అతను నదిలోకి దూకాడు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కళాశాలకు వెళ్తానని తల్లి, చెల్లికి చెప్పిన పవన్‌ కుమార్‌ ప్రభుత్వ కళాశాలకు చేరుకుని మిత్రులను కూడా కలిశాడు.

Inter student jumps into river

అయితే తరగతి గదులకు వెళ్లకుండా నేరుగా సీది వైపు వెళుతున్న ఆటో ఎక్కి సీది సమీపంలో ఉన్న బ్రిడ్జి రాగానే ఆటో నుంచి దిగాడు. తన సెల్‌ఫోన్‌ను తోటి ప్రయాణికులకు ఇచ్చి నదిలోకి దూకేశాడు. వెంటనే ప్రయాణికులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సెల్‌ఫోన్‌ ఆధారంగా విద్యార్థి వివరాలను గుర్తించి హరిజనవీధి లో ఉంటున్న స్థానికులకు సమాచారం అందించారు. పవన్‌కుమార్‌ తండ్రి జోగారావు కూలి పనికి వెళ్లగా, తల్లి పుష్ప తీమర గ్రామానికి వరిపంట కోతలకు వెళ్లారు.

సమాచారం తెలుసుకున్న స్నేహితులు నదిలో ఆరు గంటల వరకూ గాలించినా ఆచూకీ దొరకలేదు. మరోవైపు పోలీసులు హిరమండలంలోని గొట్టా బ్యారేజీ వద్ద ఉన్న ఇంజనీరింగ్‌ సిబ్బందికి ఫోన్‌లో విషయాన్ని తెలియజేశారు. విద్యార్థి అదృశ్యంపై ఎస్‌ఐ ఎం.హరికృష్ణ కేసు నమోదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Intermediate student Pavan Kumar jumped into Tanaya river in Srikakulam district of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X