బాత్ రూంకు కూడా వెళ్లొద్దా: జగన్, వెంట నలుగురైదుగురెందుకు: యనమల

ఏపీ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య మంగళవారం నాడు ఆసక్తికర చర్చ జరిగింది.

అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య మంగళవారం నాడు ఆసక్తికర చర్చ జరిగింది.

ఓ సమయంలో జగన్ సభలో లేరు. ఆ తర్వాత ఆయన సభకు వచ్చారు. జగన్ సభలో లేకపోవడాన్ని యనమల ప్రశ్నించారు. దీనిపై జగన్ తనదైన శైలిలో స్పందించారు. బాత్ రూంకు కూడా వెళ్లవద్దా అని అడిగారు. వెళ్లేటప్పుడు ఇలా చూపించి (వేలు చూపిస్తూ) వెళ్లాలని తనకు తెలియదన్నారు.

దానికి యనమల మాట్లాడుతూ.. బాత్ రూంకు అయిదే నలుగురైదుగురు ఎందుకు అని అడిగారు. కావాలనే జగన్ వెళ్లిపోయారన్నారు. మీరు ఇలా చూపిస్తారా (వేలు చూపిస్తూ) ఇలా చూపిస్తారా (మరోవేలు చూపిస్తూ) మీ ఇష్టమన్నారు. హైదరాబాదులో కూడా ఇలాగే చేశారన్నారు.

Interesting argument between YS Jagan and Yanamala

జగన్ మాట్లాడుతూ.. ఇప్పుడే తనకు తెలిసిందని, చంద్రబాబు నాయుడు తన మనవడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లారని అన్నారు.

దానికి యనమల స్పందిస్తూ... ముఖ్యమంత్రి ముందే అనుమతి తీసుకున్నారని తెలిపారు. సభకు అతి ఎక్కువ సమయం కేటాయిస్తున్న వ్యక్తిని తానేనని గొప్పగా చెబుతున్నానని జగన్ అన్నారు. వినేవాడు ఉంటే ఏదైనా చెప్పవచ్చునని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+